కర్మాగారాల్లో కార్మికుల భద్రతే ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

కర్మాగారాల్లో కార్మికుల భద్రతే ముఖ్యం

Aug 26 2026 1:30 AM | Updated on Aug 26 2026 1:30 AM

సాక్షి, యాదాద్రి: కర్మాగారాల్లో కార్మికుల భద్రతే ముఖ్యమని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పేర్కొన్నారు.మంగళవారం కలెక్టరేట్‌లో ఫ్యాక్టరీస్‌, కాలుష్య నియంత్రణ మండలి, కార్మిక , అగ్రిమాపక శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావుతో కలిసి కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. పాల్గొన్నారు . జిల్లాలోని ప్రమాదకర ఫ్యాక్టరీలలో ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రసాయన, ఔషధ పరిశ్రమల్లో ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదాల వల్ల ప్రాణనష్టం జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ప్రమాదకర కర్మాగారాల్లో థర్డ్‌ పార్టీ సేఫ్టీ కన్సల్టెంట్‌ ద్వారా భద్రత ధ్రువీకరణ పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫ్యాక్టరీల్లో డ్రైయర్లు, రియాక్టర్లు, పేలుడు ఉపశమన ప్యానెల్స్‌, భద్రతా వాల్వులు తదితర పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసి, అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ డివిజనల్‌ అధికారి శేఖర్‌ రెడ్డి, ఫ్యాక్టరీస్‌ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీదేవి, జిల్లా పరిశ్రమల అధికారి రవీందర్‌ పాల్గొన్నారు.

పరిహారం చెల్లిస్తున్నాం

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్మాణంలో భాగంగా సేకరించిన భూముల యజమానులకు నష్టపరిహారం చెల్లిస్తున్నామని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌ భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ సమస్యలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌లో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వెంకా రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement