అడ్డగూడూరు : మధ్యాహ్న భోజనం మెనూ అమలులో నిర్లక్ష్యం వహించవద్దని డీఈఓ భిక్షపతి సూచించారు. బుధవారం అడ్డగూడూరు మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం, అడ్డగూడూరు , చౌళ్లరామారంలోని జెడ్పీహెచ్‌ఎస్, ఎంపీపీఎస్‌లను ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయతో సమీక్ష నిర్వహించారు. ఆయనవెంట ఎంఈఓ ఎన్.సబిత, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు వెంకటాద్రి, జీహెచ్‌ఎం పద్మ, ఎల్‌డీఏ క్రాంతి కుమార్, సీఆర్‌పీ రామయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు.


