రూ.33.60కోట్లు విలువైన ధాన్యం పక్కదారి | - | Sakshi
Sakshi News home page

రూ.33.60కోట్లు విలువైన ధాన్యం పక్కదారి

Aug 13 2026 1:57 AM | Updated on Aug 13 2026 1:57 AM

రామన్నపేట: రామన్నపేట మండలంఇంద్రపాలనగరం పరిధిలోని విద్యా ఆగ్రోస్‌ రైస్‌ ప్రాడక్ట్స్‌లో స్టేట్‌ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బుధవారం రెండవరోజు తనిఖీలు నిర్వహించారు. రూ. 33.60కోట్లు విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. మిల్లులో భారీగా అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళ, బుధవారాల్లో తనిఖీలు నిర్వహించి ధాన్యం నిలువల్లో భారీగా తేడాలు ఉన్నట్లు గుర్తించారు. జిల్లా సివిల్‌సప్లయ్‌ అధికారిణి రోజారాణి తెలిపిన వివరాల ప్రకారం.. 2024–25ఖరీఫ్‌, 2024–25రబీ, 2025–26 ఖరీఫ్‌ సీజన్‌లకు సంబంధించి రైసుమిల్లులో సీఎంఆర్‌ పోను 8,52,713 బస్తాల ధాన్యం నిలువ ఉండాల్సింది, కానీ కేవలం 5,63, 283 బస్తాల ధాన్యం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తక్కువగాఉన్న 2,89, 430 బస్తాల ధాన్యం( 1,15,892 క్వింటాళ్ల) విలువ (క్వింటాకు రూ 2900ల చొప్పున) సుమారు 33.60కోట్ల వరకు ఉంటుంది. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించినందుకు గాను మిల్లు యజమానులపై చర్యలు తీసుకోనున్నట్లు అధికారిణి తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్‌ డీఎస్పీ అంజయ్య, డీఎం హరికృష్ణ, డీటీ బాలమణి తదితరులు పాల్గొన్నారు.

ఫ రైస్‌మిల్లులో విజిలెన్స్‌ తనిఖీల్లో అవకతవకలు బట్టబయలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement