కమిటీ ఇలా..
● అధ్యక్షుడు: (కానిస్టేబుల్ నుంచి ఇన్‌స్పెక్టర్ వరకు ఎవరైనా పోటీ చేయవచ్చు)
● ఇద్దరు ఉపాధ్యక్షులు: (ఒకవేళ కానిస్టేబుల్ లేదా హెడ్ కానిస్టేబుల్ అధ్యక్షుడైతే, ఉపాధ్యక్షుడిగా కచ్చితంగా ఎస్‌ఐ ర్యాంకు అధికారి ఉంటారు)
● సెక్రటరీ: (సబ్–ఇన్‌స్పెక్టర్ ర్యాంకు)
● జాయింట్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ: (కానిస్టేబుల్ నుంచి ఇన్‌స్పెక్టర్ వరకు)
● కోశాధికారి: (సివిల్ పీసీ, హెడ్ కానిస్టేబుల్) వీరితో పాటు అదనంగా ఆరుగురు కార్యవర్గ సభ్యులు ఈ కమిటీలో ప్రాతినిధ్యం వహిస్తా రు. వీరిలో నలుగురు సివిల్ సిబ్బంది (అందులో ఒకరు తప్పనిసరిగా మహిళా సిబ్బంది), మరో ఇద్దరు ఏఆర్ సిబ్బంది ఉంటారు.
సాక్షి, యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ఎన్నికల సందడి మొదలైంది. డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ శాఖలో ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. ఎన్నికల నోడల్ అధికారి, అడిషనల్ ఎస్పీ చేబ్రోలు లక్ష్మీనారాయణ ఈ నోటిఫికేషన్‌ను అధికారికంగా జారీ చేశారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ సంఘం ఎన్నికలు జరుగుతుండటంతో సిబ్బందిలో సర్వత్రా ఉత్సాహం వ్యక్తమవుతోంది.
1,500 మందికి ఓటింగ్ అర్హత
ఈనెల 17నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 25 న పోలింగ్, వెంటనే ఓట్ల లెక్కింపు, వెంటనే విజేతల ప్రకటన ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది అంతా ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారు. కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు, ఎస్‌ఐలు, ఇన్‌స్పెక్టర్లు అందర్ని కలిపి దాదాపు 1500 మందికి ఓటింగ్ అర్హత ఉంది. వీరంతా రహస్య ఓటింగ్ పద్ధతిలో జిల్లా పరిధిలోని 35 మంది ప్రతినిధులను ఎన్నుకుంటారు. అనంతరం ఆ ఎన్నికై న ప్రతినిధుల నుంచి ప్రధాన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు.
మూడు స్థాయిల్లో ఓటింగ్ విధానం
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేసేందుకు ఓటింగ్‌ను మూడు వేర్వేరు స్థాయిల్లో నిర్వహిస్తారు.
● పీ.ఎస్. (స్టేషన్) స్థాయి: ఈ పరిధిలో కానిస్టేబుళ్లు తమ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి ఓటు హక్కును వినియోగించుకుంటారు.
● డివిజన్ స్థాయి: ఈ స్థాయిలో హెడ్ కానిస్టేబుళ్లు, అసిస్టెంట్ సబ్–ఇన్‌స్పెక్టర్లు (ఏఎస్‌ఐ) ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు.
● జిల్లా స్థాయి: సబ్–ఇన్‌స్పెక్టర్లు (ఎస్‌ఐ), సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల (సీఐ) స్థాయి అధికారులు ఓటింగ్ నిర్వహించి, నేరుగా జిల్లా ప్రతినిధులను ఎన్నుకుంటారు.ఈ ఎన్నికల్లో పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ హోదాతో పాటు ఇతర కీలక పదవులకు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్‌ఐ స్థాయి సిబ్బంది సైతం పోటీపడే గొప్ప అవకాశం కల్పించారు.
ఫ నోటిఫికేషన్ జారీ..
ఫ 17 నుంచి నామినేషన్ల స్వీకరణ
ఫ 25వ తేదీన పోలింగ్
ఫ రహస్య ఓటింగ్ ద్వారా 35 మంది ప్రతినిధుల ఎన్నిక


