యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉద్యోగులు, సిబ్బంది ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. స్వామివారి నైవేద్యానికి, నిత్య కై ంకర్యాలు, ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడి సరుకులు పక్కదారి పడుతున్నాయి. దేవస్థానం గోదాముకు వచ్చే కాజు, బాదం, బియ్యం, నూనె, తదితర ముడి సరుకులను సంబంధిత శాఖ ఏఈఓ, సూపరింటెండెంట్ పర్యవేక్షణలో వివిధ విభాగాల సిబ్బంది రోజూ తీసుకెళ్తుంటారు. కానీ గోదాములో పనిచేసే సిబ్బంది మాత్రం ఎవరూ లేని సమయంలో కాజు పకోడి చేసుకొని ప్యాకింగ్ చేస్తున్నారు. దీంతో గోదాములో రోజూ కిలోల కొద్ది కాజు మాయమవుతోందని తెలుస్తోంది. అసలు సరుకులు ఎంత వస్తున్నాయి, ఎంత వినియోగిస్తున్నారు, మిగిలిన సరుకుల లెక్కలు ఏమిటనే సందేహాలు ఇప్పుడు భక్తుల్లో కలుగుతున్నాయి. అసలు ఈ ప్యాకింగ్ చేసిన కాజు పకోడి దేవస్థానం ఉద్యోగులు, అధికారుల ఇళ్లకు పంపిస్తున్నారా.. లేక సిబ్బంది ప్యాకింగ్ చేసుకొని బయటకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దేవస్థానం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
అధికారి ఏమంటున్నారంటే..
ఈ విషయమై సంబంధిత గోదాము అధికారి దాసోజు నరేష్‌ను వివరణ కోరగా తాను రెండు, మూడు రోజులుగా సెలవులో ఉన్నానని, నాకు ఇంతకు ముందే తెలిసిందని సమాధానం ఇచ్చారు. అంతే కాకుండా కాజు పకోడి బయటి నుంచి కొనుగోలు చేశారని వెల్లడించారు. కొనుగోలు చేసిన పకోడి మిగిలితే దేవస్థానానికి చెందిన కవర్‌లో ప్యాకింగ్ చేసుకున్నారని సమాధానం చెప్పారు. అది పెద్ద ఇష్యు కాదని పేర్కొనడం గమనార్హం.
ఫ యాదగిరీశుడి గోదాములో సరుకులు పక్కదారి
ఫ కాజు పకోడి చేసి ప్యాకింగ్ చేస్తున్న సిబ్బంది


