సాక్షి, యాదాద్రి : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం పోలీస్ ఏఆర్‌హెడ్ క్వాటర్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, ఏఎస్పీ లక్ష్మీనారాయణతో కలిసి నిర్వహించిన సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. 13న సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు. 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయాలన్నారు. 15న చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డే నిర్వహించి 4 ఏళ్ల పైబడిన పిల్లలకు కూడా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరింపజేయడంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. 16న ఉద్యోగులందరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. 17న ప్రమాద క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంపై శిక్షణ ఇవ్వాలన్నారు. 18న ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఎస్పీలు రవీందర్, ప్రభాకర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్ట్ అధికారి ఇమ్రాన్, డీపీఓ శ్రీకాంత్, డీఈఓ సత్యనారాయణ, డీఐఈఓ రమణి, ఆర్‌అండ్ బీ అధికారి సరిత పాల్గొన్నారు.
ఫ ఎస్పీ అక్షాంశ్ యాదవ్


