నేతన్న కల సాకారం చేసిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

నేతన్న కల సాకారం చేసిన ప్రభుత్వం

Apr 11 2026 10:04 AM | Updated on Apr 11 2026 10:04 AM

సాక్షి, యాదాద్రి : చేనేత భరోసా పథకం కింద జిల్లాలోని నేతన్నలకు ప్రభుత్వం రుణమాఫీ చేసి వారి కల సాకారం చేసిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరిలోని లింగ బసవ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంతోపాటు కలిసి ఆయన చేనేత భరోసా మెగా చెక్కు పంపిణీ చేసి మాట్లాడారు. రుణమాఫీ కింద రూ.19.24 కోట్లను రుణమాఫీ, నేత భరోసా కింద రూ. 3.29 కోట్లు, చేనేత బీమా కింద రూ. 2.40 కోట్ల నిధులు విడుదల చేయడం శుభపరిణామన్నారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్లు భాస్కరరావు, వెంకారెడ్డి, రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పద్మ, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకుడు శ్రీనివాసరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అవేస్‌ చిస్తి, పోచంపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ తడక వెంకటేశం, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement