బొల్లేపల్లి సర్పంచ్ ఇంటిపై దాడి
భువనగిరి : మండలంలోని బొల్లేపల్లి గ్రామంలో సర్పంచ్ గోద రమాదేవి, శ్రీనివాస్‌గౌడ్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి దాడి చేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తాము భారీ మెజార్టీతో గెలుపొందడంతో జీర్ణించుకోలేక గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంటిపై దాడికి పాల్పడ్డారని వారు తెలిపారు. దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించారని, తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని చెప్పారు.


