భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు
యాదగిరిగుట్ట: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని యాదగిరిగుట్ట క్షేత్రంలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం ఈఓ వెంకట్రావ్‌తో కలిసి డీసీపీ అక్షాంశ్‌యాదవ్ పరిశీలించారు. క్యూలైన్లు, దర్శనం, భద్రత తదితర అంశాలపై చర్చించారు. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంటుందని, ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ, ఈఓ తెలిపారు. అదే విధంగా భక్తులను, భక్తుల బ్యాగులను తనిఖీ చేయడానికి ఏర్పాటు చేసిన బ్యాగేజీ స్కానర్‌ను ట్రయల్‌రన్ చేసి పరిశీలించారు. కార్య క్రమంలో ఏసీపీ శ్రీనివాసనాయుడు, డిప్యూటీ ఈఓ భాస్కరశర్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దయాకర్‌రెడ్డి, సీఐ భాస్కర్, ఆర్‌ఐ శేషగిరిరావు పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు


