రైల్వే లెవల్ క్రాసింగ్‌ల తనిఖీ
భువనగిరి : బీబీనగర్–మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సెక్షన్‌లో గేట్ నంబర్ 17, 20–ఈ వద్ద రైల్వే లెవల్ క్రాసింగ్‌లను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ శ్రీ వాస్తవ శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు.గేట్ బూమ్, రికార్డులు, భద్రతా పరికరాల పనితీరును పరిశీలించారు. గేట్‌మన్లతో మాట్లాడి క్రాసింగ్‌ల నిర్వహణ తీరును తెలుసుకున్నారు. అలాగే ట్రాక్‌మన్లతో మాట్లాడి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నారు. రైళ్లు సురక్షింతంగా రాకపోకలు సాగించడంలో ట్రాక్‌మన్లు, గేట్‌మన్ల పాత్ర కీలకమని, అప్రమత్తంగా వ్యవహరించాలని వారికి సూచించారు. రైళ్లు వచ్చే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పని చేస్తున్న పలువురు గేట్‌మన్లు, పెంట్రోలింగ్ మన్లను అభినందించి, వారికి నగుదు బహుమతి ప్రకటించారు. ఆయన వెంట సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ గోపాల్ కృష్ణన్, ఇతర అధికారులు ఉన్నారు.


