చిల్లింగ్‌సెంటర్‌కు తాళం, ధర్నా
భువనగిరిటౌన్ : పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాడి రైతులు గురువారం భువనగిరిలోని పాల శీతలీకరణ కేంద్రం గేట్‌కు తాళం వేసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా నార్ముల్ డైరెక్టర్ కస్తూరి పాండు మాట్లాడుతూ.. నాలుగు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పాడి సంపదను పోషించుకునేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. భువనగిరి పరిధిలో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయన్నారు. బస్వాపురం పాడి రైతులకు రూ.50 లక్షలు, గంగసానిపల్లి రూ.5లక్షలు, దాతర్‌పల్లి రూ.35లక్షలు, ముత్తిరెడ్డిగూడెం రూ.5 లక్షలు, హుస్నాబాద్ రైతులకు రూ. 30 లక్షలు బకాయిలు ఉన్నాయన్నారు. 48 గంటల్లో చెల్లించాలని, అప్పటి వరకు పాలశీతలీకరణ కేంద్రం వద్దనే టెంట్లు వేసుకొని ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. అయినా ప్రభుత్వం స్పందించనిపక్షంలో ఈనెల 27న కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం :
ఎమ్యెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి
పాడి రైతుల ధర్నా శిబిరాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. జిల్లా ఎమ్మెల్యేలం కలిసి చర్చించి సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ధర్నాలో బస్వాపురం, గంగసానిపల్లి, దత్తాయిపల్లి, ముత్తిరెడ్డిగూడెం, హుస్నాబాద్, కాటేపల్లి పాడి రైతులు ఉడుత శ్రీశైలం, బొల్లారం లింగం, దొమ్మాటి శంకరయ్య, దాయి మహేష్, బోయిని పాపయ్య, భీమగాని కుమార్, ఉడుత లక్ష్మి, చిక్కుల శంకరయ్య, ఉడుత విష్ణు, రాసాల దయాకర్, రాసాల నరేష్, దేవేందర్, ఉడుత బాలయ్య, మచ్చ ఎల్లేష్, ఉడుత కార్తీక్, రాసాల బాల మల్లయ్య, ఎనబోయిన విజయ్‌కుమార్, ఉడుత వెంకటేష్, రాంపల్లి గణేష్, బాలస్వామి, నరసింహ, శ్రీశైలం, రైతుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చిల్లింగ్‌సెంటర్‌కు తాళం, ధర్నా


