మద్యానికి దూరంగా ఐదేళ్లు
ఫ సర్పంచ్‌గా తొలి ప్రమాణం చేసిన గుర్జవానికుంటతండా సర్పంచ్
తుర్కపల్లి: తుర్కపల్లి మండలం గుర్జవానికుంటతండా నూతన సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన గుగులోతు దూప్‌సింగ్‌నాయక్ మద్యంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను సర్పంచ్‌గా ఉన్న ఐదేళ్ల కాలంలో మద్యం సేవించబోనని, మద్యం తాగే వారిని ప్రోత్సహించబోనని తొలి ప్రమాణం చేశారు. గ్రామ సర్పంచ్‌గా తన ప్రయాణాన్ని మద్యం విరమణతో శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. యువత మద్యానికి బానిసై విలువైన జీవితాలను నాశనం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయానికి గ్రామ ప్రజలు సహకరించాలని, మద్యపాన నిషేధం చేస్తామని గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు.
భార్య ఉప సర్పంచ్.. భర్త వార్డు సభ్యుడిగా..
మర్రిగూడ : మండలంలోని రాజాపేటతండాలో 8 వార్డులు ఉండగా.. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో వార్డు నుంచి కొర్ర సునీత, 3వ వార్డు నుంచి ఆమె భర్త కొర్ర శంకర్ విజయం సాధించారు. మిగతా వార్డు సభ్యుల మద్దతుతో కొర్ర సునీత ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సోమవారం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సర్పంచ్ కొడాల వెంకట్‌రెడ్డి, ఉప సర్పంచ్ కొర్ర సునీత, వార్డు సభ్యులుగా సునీత భర్త కొర్ర శంకర్‌తో పాటు మిగతా వారు ప్రమాణ స్వీకారం చేశారు.
వార్డు సభ్యులుగా దంపతుల ప్రమాణ స్వీకారం
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా భార్యాభర్తలు మూడావత్ తనీష్, మూడావత్ స్రవంతి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులుగా 8వ వార్డు నుంచి మూడావత్ తనీష్, 9వ వార్డు నుంచి ఆయన భార్య మూడావత్ స్రవంతి పోటీ చేసి గెలుపొందారు. కాగా తనీష్ ఆటో డ్రైవర్‌గా, ఆర్‌ఎంపీ వైద్యుడిగా పని చేస్తున్నారు. స్రవంతి మెడికల్ నడుపుతూ గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతోంది.
నా వేతనాన్ని గ్రామ అవసరాలకు వినియోగిస్తా
చౌటుప్పల్ : ప్రతి నెల తనకు వచ్చే వేతనాన్ని ఐదేళ్ల పాటు గ్రామ అవసరాలకు వినియోగిస్తానని చౌటుప్పల్ మండల పరిధిలోని జైకేసారం గ్రామ నూతన సర్పంచ్ సమిరెడ్డి భారతమ్మ తెలిపారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమెను గ్రామస్తులు అభినందించారు.
పాలకవర్గాలు నిస్వార్థంగా పనిచేయాలి
చిట్యాల : గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికై న పాలకవర్గ సభ్యులు నిస్వార్థంగా పనిచేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తన స్వగ్రామమైన చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు ఓటర్లలో చేయి చాపుడు.. నోరు తెరుచుడు ఉండొద్దని అప్పుడే నిజాయతీ గల ప్రజాప్రతినిధులు ఎన్నికవుతారని అన్నారు. రాజకీయాలు, ఎన్నికలు డబ్బుమయంగా మారాయని ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా కోట్లాది రూపాయలను పోటాపోటీగా అభ్యర్థులు ఖర్చు చేశారని చెప్పారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేయాలని ఎన్నికల అనంతరం గ్రామాల అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ మనోహర్, పంచాయతీ కార్యదర్శి అరుణ్‌కుమార్, మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుత్తా వెంకట్రామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మద్యానికి దూరంగా ఐదేళ్లు
మద్యానికి దూరంగా ఐదేళ్లు
మద్యానికి దూరంగా ఐదేళ్లు


