ప్రజా సేవే పరమావధిగా..
గ్రామ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తా. గ్రామంలోని నా సొంత స్థలంలో నా సతీమణి గుంటకండ్ల సావిత్రమ్మ జ్ఞాపకార్థం ఫంక్షన్‌హాల్ నిర్మిస్తా. లైబ్రరీ, పాఠశాలకు అదనపు తరగతి గదులను నిర్మించేలా కృషిచేస్తా. డ్రెయినేజీ వ్యవస్థను సరిచేసి, గ్రామంలో స్వచ్ఛత, పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తా.
– గుంటకండ్ల రామచంద్రారెడ్డి
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఆ ఊళ్లో ఎవరికై నా కష్టమొస్తే నేనున్నానంటూ ముందుకొస్తారు. రైతుగా, ఉద్యోగిగా సేవలు అందించిన ఆయన ఇప్పుడు ప్రజాప్రతినిధిగా మరిన్ని సేవలు అందించేందుకు ముందుకొచ్చారు. ఆయనే 95 ఏళ్ల వయస్సులో నాగారం సర్పంచ్‌గా ఎన్నికై న గుంటకండ్ల రామచంద్రారెడ్డి. సోమవారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.
సమస్యల పరిష్కారానికి కృషి..
గుంటకండ్ల లచ్చిరెడ్డి–రామక్క దంపతులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమారుడు పిచ్చిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు, అదే గ్రామానికి సర్పంచ్‌గా 20 ఏళ్లు సేవలందించారు. రెండో కుమారుడైన రామచంద్రారెడ్డి 1930లో జన్మించారు. రామచంద్రారెడ్డి ఉపాధ్యాయుడిగా.. ఆ తర్వాత పట్వారీగా పనిచేశారు. గ్రామంలో ఉంటూ రాజకీయాలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తూ వచ్చారు. ఎస్సీలకు ఇళ్ల స్థలాలు ఇప్పించారు. బీసీలు ఇళ్లు నిర్మించుకోవడానికి కొంత ఆర్థికసాయం చేశారు. గ్రామస్తుల సహకారంతో పీహెచ్‌సీ కోసం భూమి కొనుగోలు చేసి ఇచ్చారు. విద్యుత్, తాగునీటి సమస్యలను పరిష్కరించారు. బ్యాంకు ఏర్పాటుకు సైతం కృషి చేశారు. పెద్దాయనగా, బాపుగా పిలుచుకునే ఆయన ఇప్పుడు సర్పంచ్‌గా ఎన్నికై మరిన్ని సేవలు అందించేందుకు ముందుకొచ్చారు.
ఫ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన గుంటకండ్ల రామచంద్రారెడ్డి
ఫ 95 ఏళ్ల వయస్సులో నాగారం
సర్పంచ్‌గా బాధ్యతల స్వీకరణ


