ఒక్క ఓటుతో వరించిన విజయం
పాలకవీడు : మండలంలోని మహంకాళిగూడెం గ్రామ సర్పంచ్ జనరల్‌కు రిజర్వ్ కాగా సర్పంచ్‌గా నలుగురు బరిలో నిలిచారు. బుధవారం జరిగిన పోలింగ్‌లో మొత్తం 600 ఓట్లకు గాను 558 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పిడమర్తి దాసుకు 187 ఓట్లు పోలవ్వగా.. స్వతంత్ర అభ్యర్థి చిట్టిప్రోలు వెంకటనారాయణకు 186 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో పిడమర్తి దాసు సర్పంచ్‌గా విజయం సాధించారు.
అప్పుడు ఎంపీపీలు.. ఇప్పుడు సర్పంచులు
చందంపేట : గతంలో ఉమ్మడి చందంపేట ఎంపీపీ పనిచేసిన కేతావత్ సవిత మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో యల్మలమంద గ్రామ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందింది. అదేవిధంగా చందంపేట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ఏర్పుల రమాదేవి గతంలో చందంపేట ఎంపీపీగా పనిచేయగా.. తాజాగా కంబాలపల్లి సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా విజయం సాధించారు.
తాత.. తండ్రి.. తనయుడు..
చౌటుప్పల్ : మండల పరిధిలోని ఎస్.లింగోటం గ్రామ సర్పంచ్‌గా భీమిడి ప్రదీప్‌జి గెలుపొందారు. అయితే ప్రదీప్‌జి తండ్రి భీమిడి శంకరాజి 2001–06 వరకు అదే సర్పంచ్‌గా పనిచేశారు. అంతేకాకుండా ప్రదీప్‌జి తాత భీమిడి మల్లాజి ఎస్.లింగోటం గ్రామానికి మొదటి సర్పంచ్‌గా పనిచేశారు. ప్రదీప్‌జి కుటుంబంలో మూడు తరాల వారు సర్పంచ్‌గా ఎన్నికవ్వడం విశేషం.
కారోబార్ నుంచి సర్పంచ్‌గా గెలిచి..
చౌటుప్పల్ : మండల పరిధిలోని ధర్మోజిగూడేనికి జువ్వి నర్సింహ 2019 వరకు అదే గ్రామంలో కారోబార్‌గా పనిచేసి మానేశాడు. ఈసారి గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కాగా.. బీజేపీ, సీపీఎం మద్దతుతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించాడు. గతంలో సర్పంచ్‌ల ఆదేశాలు పాటించిన నర్సింహ ఇప్పుడు సర్పంచ్ హోదాలో సిబ్బందికి ఆదేశాలు ఇవ్వనున్నాడు.
భార్య సర్పంచ్.. భర్త ఉప సర్పంచ్
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ మండలం అమరవరం గ్రామంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కర్నాటి శిరీష సర్పంచ్‌గా గెలుపొందింది. ఆమె భర్త కర్నాటి వీరనాగిరెడ్డి ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామంలో మొత్తం 12 వార్డులు ఉండగా.. 9 వార్డుల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు మూడు వార్డుల్లో విజయం సాధించారు. దీంతో సర్పంచ్ శిరీష భర్త, 7 వార్డు సభ్యుడైన వీరనాగిరెడ్డిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు.
ఒక్క ఓటుతో వరించిన విజయం
ఒక్క ఓటుతో వరించిన విజయం
ఒక్క ఓటుతో వరించిన విజయం


