
రూ.1,028.63 కోట్ల రుణాలు పంపిణీ
సాక్షి, యాదాద్రి : ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు పంటలు, దీర్ఘకాలిక రుణాల కింద మొత్తం రూ.1,028.63 కోట్లు పంపిణీ చేశామని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం భువనగిరి కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఇందులో పంట రుణాలే రూ.467.61 కోట్లు ఉండడం విశేషమన్నారు. వ్యవసాయ ఆధారిత రుణాల వార్షిక లక్ష్యం 23.69శాతంసాధించడం సుభపరిణామన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో రూ.281.78 కోట్లు రుణాలు మంజూరు చేసి చిన్న, మధ్య తరహా పరిశ్రమల వ్యాపారులకు ఊతమిచ్చినట్లు వివరించారు. మొత్తం ప్రాధాన్య రంగాల వార్షిక రుణ లక్ష్యం 24.55 శాతానికి చేరుకోవడం హర్షణీయమన్నారు. పీఎంఎంవై కింద 3,178 ఖాతాలకు రూ.63.54 కోట్లు, సెర్ప్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రూ.219.25 కోట్లు, మెప్మా ఎస్‌ఎచ్‌జీలకు రూ.19.29 కోట్లు రుణాలు మంజూరయ్యాయి. పెండింగ్‌లో ఉన్న విశ్వకర్మ దరఖాస్తులతోపాటు స్వయం సహాయక సంఘాల్లో రికవరీ తక్కువగా ఉన్న మండలాలపై దృష్టిసారించాలని ఆదేశించారు. ప్రజలు మైక్రో ఫైనాన్స్‌లలో రుణాలు తీసుకోకుండా, బ్యాంకులు సకాలంలో రుణాలు అందించాలని సూచించారు. ఈ సమీక్షలో డీఆర్డీఓ నాగిరెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం రవీందర్, జిల్లా చేనేత,జౌళి శాఖ అధికారి శ్రీనివాస్, మెప్మా పీడీ రమేష్, జిల్లా లీడ్ మేనేజర్ శివరామకృష్ణ, ఆర్బీఐ ఏజీఎం లక్ష్మీశ్రావ్య, నాబార్డ్ డీడీఎం రవీందర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం కమలాకర్, అధికారులు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.
153 మంది జీపీఓలకు నియామకపత్రాలు
భువనగిరిటౌన్ : జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 153 మంది గ్రామపాలన అధికారు(జీపీఓ)లకు నియామక పత్రాలు అందజేస్తామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్‌న్స్‌కు భువనగిరి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు అదనపు కలెక్టర్ వీరారెడ్డి, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్ హాజరయ్యారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు