అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు రాష్ట్రస్థాయి అవార్డు | - | Sakshi
Sakshi News home page

అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు రాష్ట్రస్థాయి అవార్డు

Sep 5 2025 4:49 AM | Updated on Sep 5 2025 7:41 AM

అసోసి

అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు రాష్ట్రస్థాయి అవార

ఆలేరు డిగ్రీ కళాశాల వృక్ష శాస్త్ర అధ్యాపకురాలికి.. ఎంజీయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు.. ఎన్టీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడికి..

ఉమ్మడి జిల్లాలోని పలు డిగ్రీ కళాశాలలకు చెందిన అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో పాటు ఎంజీయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికయ్యారు. వీరు శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు.

రామన్నపేట: రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికై న రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్రం(ఫిజిక్స్‌) అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ జె. చిన్నబాబు మహబూబ్‌నగర్‌ జిల్లా వీపనగండ్ల మండలం బెక్కెం గ్రామంలో జన్మించారు. చిన్నబాబు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రంలో పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేశారు. 2001 డీఎస్సీలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా, 2003లో డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. 2012లో జూనియర్‌ లెక్చరర్‌గా, 2013 డిగ్రీ లెక్చరర్‌గా ఎంపికయ్యారు. సిటీ కళాశాలలో పనిచేసిన రోజుల్లో గ్లాస్‌ రీసెర్చ్‌పై ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి విద్యార్థుకు మార్గదర్శకం చేశారు. తెలుగు అకాడమీ డిగ్రీ, ఓపెన్‌ ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను రచించారు. ఇంటర్‌ బోర్డు సిలబస్‌ రివ్యూ కమిటీ మెంబర్‌గా కూడా ఆయన పనిచేశారు.

ఆలేరు: ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్ష శాస్త్రం(బొటనీ) అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎన్‌సీ. సౌజన్య రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకురాలు అవార్డుకు ఎంపికయ్యారు. ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏడాది కాలంగా వృక్ష శాస్త్రం అధ్యాపకురాలిగా ఆమె పని చేస్తున్నారు. సౌజన్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సీలో గోల్డ్‌ మెడల్‌ అందుకున్నారు. ప్రొఫెసర్‌ మనోహర ఆచారి పర్యవేక్షణలో పరిశోధన చేసి డాక్టర్‌ పట్టా పొందారు. 2022లో ఆమె తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ న్యాక్‌ కోఆర్డినేటర్‌ అవార్డును అందుకున్నారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలను సమర్పించారు. వృక్ష శాస్త్రం విద్యార్థుల కోసం పలు పస్తకాలను ఆమె రచించారు. సౌజన్యకు కళాశాల ప్రిన్సిపాల్‌ రాజారామ్‌, అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు.

నల్లగొండ టూటౌన్‌: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రసాయన శాస్త్రం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రమేష్‌ ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన ఎంజీయూలో 2009 నుంచి పనిచేస్తున్నారు. రమేష్‌ను ఎంజీయూ వైస్‌ చాన్స్‌లర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌, రిజిస్ట్రార్‌ అలువాల రవి, ఇతర ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అధ్యాపకులు తది తరులు అభినందించారు.

రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ) తెలుగు శాఖ అధ్యక్షుడు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వెల్దండి శ్రీధర్‌ రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకోనున్నారు. శ్రీధర్‌ గత రెండేళ్లుగా ఎన్జీ కళాశాలలో తెలుగు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన ఆయన వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసి, ఓయూలో ఎంఏ తెలుగు చేశారు. అనంతరం అదే విశ్వవిద్యాలయంలో డా. నందిని సిధారెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సాహిత్యం సమగ్ర పరిశీలన అనే అంశంపై పీహెచ్‌డీ పూర్తిచేశారు. ఆయన ఆసు కవిత్వం, పుంజీతం కథలు, కథా కచ్చీరు కథ విమర్శ మొదలైన పుస్తకాలు రాశారు. తెలుగు కథ ప్రాంతీయ ఆస్తిత్వం అనే గ్రంథంతో పాటు పలు గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. శ్రీధర్‌ జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించారు. సంగిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి తెలంగాణ ఉత్తమ కథా వార్షికలను వెలువరిస్తున్నారు. శ్రీధర్‌ను ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్‌ సముద్రాల ఉపేందర్‌, వైస్‌ ప్రిన్సిపాళ్లు పి. రవికుమార్‌, అంతటి శ్రీనివాస్‌, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ వైవీఆర్‌. ప్రసన్నకుమార్‌, పరీక్షల నియంత్రణాధికారి బి. నాగరాజు, అధ్యాపకులు అభినందించారు.

అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు రాష్ట్రస్థాయి అవార1
1/2

అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు రాష్ట్రస్థాయి అవార

అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు రాష్ట్రస్థాయి అవార2
2/2

అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు రాష్ట్రస్థాయి అవార

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement