
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
రాజాపేట : వర్షాలకు నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రాజాపేటలో జరిగిన బీఆర్‌ఎస్ నాయకుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్పిన విధంగా ప్రాణనష్టానికి రూ.25లక్షలు, పంట నష్టానికి ఎకరానికి రూ.30వేలు చెల్లించాలన్నారు. రైతులకు అవసరం మేరకు యూరియా పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సట్టు తిరుమలేష్, సందిల భాస్కర్‌గౌడ్, గుంటి మధుసూదన్‌రెడ్డి, వీరేశం, యాదగిరి, నాగరాజు, వెంకటేశ్వర్‌రెడ్డి, రాములునాయక్, లక్ష్మణ్‌నా యక్, రాములునాయక్ పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం సంప్రదాయ పూజలు ఆగమ శాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవచేపట్టారు. ఆండాళ్ అమ్మవారికి ఇష్టమైన నాధ స్వరం వినిపించారు. అంతకుముందు వేకువజామున సుప్రభాత సేవ, గర్భాలయంలో నిజాభిషేకం తదితర పూజలు నిర్వహించారు.
టీచర్లు, ఆయా పోస్టులకు దరఖాస్తుల
భువనగిరి: ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో టీచర్లు, ఆయా పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు. టీచర్లకు ఇంటర్ లేదా తత్సమానం, ఆయాలకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు.అభ్యర్థుల వయసు 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. అర్హత, అసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తుకు ధ్రువీకరణ పత్రాలు జతపరిచి సంబంధిత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు ఈ నెల 12 లోపు అందజేయాలని కోరారు.