
విద్యార్థుల ఉన్నతిలో గురువులే కీలకం
ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
భువనగిరి: విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలకమని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులను సమాజ మార్గదర్శకులుగా రూపుదిద్దడంలో ఉపాధ్యాయులు కృషి ఎంతో ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే రెండు దఫాలు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిందన్నారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలని కోరారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో 7వ స్థానంలో ఉండడం వెనుక ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి ఉందన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో నిలుపాలన్నారు. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 50 మంది జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, డీఈఓ సత్యనారాయణ, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్‌రెడ్డి, ఏడీ ప్రశాంత్‌రెడ్డి, సెక్టోరియల్ అధికా రులు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

విద్యార్థుల ఉన్నతిలో గురువులే కీలకం