
6 గంటల నుంచే క్యూలైన్
అడ్డగూడూరు: యూరియా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అరకొరగా వస్తున్న యూరియా పూర్తిస్థాయిలో అందకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అడ్డగూడూరు సొసైటీకి గురువారం సాయంత్రం 444 బస్తాల యూరియా వచ్చింది. టోకెన్ ఇచ్చిన 228 మంది రైతులకు శుక్రవారం ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేశారు. సమాచారం అందుకున్న రైతులు పెద్ద సంఖ్యలో సొసైటీ కార్యాలయానికి తరలివచ్చి బారులు దీరారు. పొద్దస్తమానం నిరీక్షించినా యూరియా అందలేదు. శనివారం, సోమవారం రోజు పంపిణీ చేసేందుకు 210 మంది రైతులకు ఒక్కొక్కరికి రెండు బస్తాలకు టోకెన్‌లు ఇచ్చామని వ్యవసాయ అధికారి పాండురంగాచారి తెలిపారు.
గుండాల: గుండాల పీఏసీఎస్ వద్ద చెప్పులను క్యూలో పెట్టి రైతులు నిరీక్షించారు. ఒక్క బస్తా కోసం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాశారు.
ఫ పీఏసీఎస్‌ల వద్ద యూరియా కోసం బారులుదీరుతున్న రైతులు
ఫ ఒక్క బస్తా కోసం గంటల తరబడి నిరీక్షణ