ఆశల ఇంటికి రుణ సాయం | - | Sakshi
Sakshi News home page

ఆశల ఇంటికి రుణ సాయం

Sep 6 2025 4:25 AM | Updated on Sep 6 2025 4:25 AM

ఆశల ఇ

ఆశల ఇంటికి రుణ సాయం

రూ.2.50 లక్షలు మంజూరయ్యాయి

అప్పులున్నా రుణం ఇప్పిస్తున్నాం

సాక్షి యాదాద్రి: ‘వలిగొండ మండలం సుంకిశాలకు చెందిన పోలేపల్లి అనురాధకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. కానీ, పని మొదలు పెడదామంటే చేతిలో చిల్లి గవ్వ లేదు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఆమెకు ప్రభుత్వం అండగా నిలిచింది. స్వయం సహాయక సంఘంలో పావలా వడ్డీకి రూ.2 లక్షల రుణం ఇప్పించింది. ఇందుకు గాను ప్రతి నెలా రూ. 8 వేల చొప్పున కిస్తులు చెల్లిస్తుంది. బేస్మెంట్‌ వరకు రూ.1 లక్ష బిల్లు వచ్చింది. చాలా కాలంగా ఇల్లు లేక ఇబ్బంది పడ్డామని, ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడం ఆనందంగా ఉందని లబ్ధిదారుల అనురాధ తెలిపారు’. ఇటువంటి వారు జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నారు.

నిరుపేదల సొంతంటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టింది. రెండు విడతల్లో 9,495 ఇళ్లు మంజూరయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాల వల్ల పలువురు నిర్మాణాలు చేపట్టేందుకు వెనుకాడుతున్నారు. అలాంటి వారికి స్వయం సహాయక సంఘాల నుంచి రుణాలు ఇప్పిస్తూ ఆర్థికంగా చేయూతనిస్తోంది.

రూ.19.75 కోట్లు ఇచ్చారు.. జిల్లాలోని 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రూ.19.75 కోట్ల రుణాలు ఇచ్చారు. గ్రామాల్లో 1,202 ఇళ్లకు రూ.14.24 కోట్లు, ఆరు మున్సిపాలిటీల్లో 546 ఇళ్లకు రూ. 5.51 కోట్లు రుణాలు మంజూరు చేశారు. ఇందులో అత్యధికంగా భువనగిరి, బీబీనగర్‌లో వందమందికి పైగా రుణాలు మంజూరు చేశారు.

8వేల ఇళ్లకు మార్కింగ్‌

రెండు విడతల్లో 9,495 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 8 వేల ఇళ్లకు ముగ్గు పోశారు. చాలా మందికి మహిళా సంఘాల ద్వారా అత్యవసర రుణాలు అందాయి. అయితే ఇళ్లు మంజూరైనప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల పనుల ప్రారంభానికి జాప్యం అవుతున్న విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. మహిళా సంఘాలతో మాట్లాడి రుణాలు ఇప్పించడంతో ఇళ్ల నిర్మాణంలో వేగం పెరిగింది.

స్రీనిధి, బ్యాంకు లింకేజీ,

అంతర్గత పొదుపు నుంచి రుణం

మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో మహిళా సంఘాలకు సీ్త్ర నిధి, బ్యాంకు లింకేజీ, సంఘం అంతర్గత పొదుపు నుంచి రుణం ఇచ్చారు. గతంలో రుణాలు తీసుకున్న సంఘాలకు మళ్లీ రుణం ఇచ్చారు. తీసుకున్న రుణాన్ని నాలుగు విడతల్లో వాయిదా పద్ధతిలో చెల్లించాలి. అయితే సంఘంలో సభ్యుల ఆర్థిక స్థితిని బట్టి రూ.50 వేల నుంచి రూ.2.50లక్షల వరకు రుణాలు ఇచ్చారు. ఈ రుణాన్ని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రుణం కింద ఇస్తున్నారు.

ఆర్థిక సమస్యలున్నవారికి మహిళా సంఘాల చేయూత

ఫ రూ.50వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణం

ఫ ఇప్పటి వరకు రూ.19.75 కోట్లు మంజూరు

ఫ అత్యధికంగా భువనగిరి, బీబీనగర్‌లో..

ఫ వేగం పుంజుకోవడానికి రుణం దోహదం

మాది మాసాయిపేట. ఇందిరమ్మ ఇళ్లు మంజ.ఊరైంది. కానీ, బేస్మెంట్‌ వరకు నిర్మిస్తేనే రూ.1 లక్ష బిల్లు వస్తుంది. తన ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇంటి నిర్మాణం ఆపేశారు. దీంతో మంజులకు గ్రామంలోని అఖిల మహిళా సంఘం రూ. 2,50 లక్షలు మంజూరు చేసింది. ఈ డబ్బులతో మంజుల ఇంటి నిర్మాణం ప్రారంభించింది. ప్రతి నెలా సంఘబంధానికి రూ. 10 వేల చొప్పున చెల్లిస్తుంది.

–వాకిటి మంజుల, లబ్ధిదారు, మాసాయిపేట

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆర్ధికంగా చేయూతనిస్తున్నాం. గతంలో సంఘంలో అప్పులు ఉన్నా కూడా ఇంటి నిర్మాణం కోసం రూ. లక్ష వరకు రుణం ఇప్పిస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు రూ.19.75 కోట్ల రుణాలు ఇచ్చాం. క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకుంది. రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా నిలిచింది.

–భాస్కర్‌, అదనపు కలెక్టర్‌

ఆశల ఇంటికి రుణ సాయం 1
1/1

ఆశల ఇంటికి రుణ సాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement