గణేష్‌ నిమజ్జనానికి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

గణేష్‌ నిమజ్జనానికి సిద్ధం

Sep 4 2025 10:43 AM | Updated on Sep 4 2025 10:43 AM

గణేష్

గణేష్‌ నిమజ్జనానికి సిద్ధం

ఈ ప్రాంతాల్లోనే నిమజ్జనం

భువనగిరి పెద్ద చెరువు, బీబీనగర్‌ చెరువు, రాయిగిరి చెరువు, చౌటుప్పుల్‌లోని మల్కాపురం చెరువు, పెద్దకొండూరు చెరువు, పోచంపల్లిలోని పోచంపల్లి చెరువు, రామన్నపేటలోని తుమ్మలగూడెం చెరువు, మోత్కూర్‌లోని మోత్కుర్‌ చెరువు, వలిగొండలోని సంగెంలో భీమలింగం చెరువు, అక్కచెల్ల చెరువు, యాదగిరిగుట్టలో చాకలిగిద్దచెరువు, మల్లాపూర్‌ చెరువు, ఆలేరు సమీపంలోని గోధుమకుంట చెరువు, ఆత్మకూర్‌(ఎం) చెరువు, అడ్డగూడూరులో బిక్కేరువాగు, ఆలేరు మండలం కొలనుపాక చెరువులను గణేష్‌ నిమజ్జనానికి అధికారులు ఎంపిక చేశారు.

సాక్షి, యాదాద్రి : గణేష్‌ నిమజ్జనానికి జిల్లా యయంత్రాంగం సిద్ధమౌతోంది. గురు, శుక్రవారాల్లోనే నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలో ఏర్పాటు చేసిన 3,599 గణనాథుల విగ్రహాల శోభాయాత్రలు, చెరువుల్లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై జిలా యంత్రాంగం, రాచకొండ పోలీస్‌లు కట్టుదిట్టమైన ప్రణాళికను రూపొందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటలను జరుగకుండా పోలీస్‌, విద్యుత్‌ శాఖలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి. భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్‌, పోచంపల్లి, మోత్కూరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలతోపాటు గ్రామీణ చెరువులు నిండా నీరుండడంతో వాటిల్లోనే నిమజ్జనం చేసేందుకు విద్యుత్‌ లైట్లు, క్రేన్లు అందుబాటులో ఉంచారు. విగ్రహాలను నిర్వాహకులే చెరువుల్లోకి తీసుకొని వెళ్లకుండా జేసీబీలు, క్రేన్‌న్‌లను అందుబాటులో పెట్టారు.

భువనగిరి జిల్లా కేంద్రంలో..

జిల్లా కేంద్రంలో ఈ నెల 5న నిర్వహించే గణేష్‌ శోభాయాత్రకు పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలో మొత్తం 353 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 34 విగ్రహాలకు వరకు నిమజ్జనం కాగా 319 ఈ నెల 5న నిమజ్జనం చేయనున్నారు. భద్రత కోసం ఇద్దరు డీసీపీలు, ఇద్దరు ఏసీపీలు, ఆరుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 160 సివిల్‌ పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలను నియమించారు. భువనగిరి పట్టణంలో 100 సీసీ కెమెరాలు, షీటీంలు, కై ంటీంల, ఎస్‌ఓటీ పోలీసులు పర్యవేక్షణ ఉంటుంది. భువనగిరి చెరువు వద్ద 15 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.

189 మంది సిబ్బంది

భువనగిరి మున్సిపాలిటీ చెందిన పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్‌ విభాగాలకు చెందిన 189 మంది సిబ్బందిని నియమించారు. 35 వార్డుల్లో నిమజ్జన కార్యక్రమాన్ని దగ్గర ఉండి పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులు నియమించారు. నిమజ్జనాన్ని తిలకించేందుకు ఎక్కువ మంది జనం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చెరువుల వద్ద బ్లీచింగ్‌ పౌడర్‌, మంచినీరు తదితర సౌకర్యాలను కల్పిస్తున్నారు.

ఐదు రూట్లలో శోభాయాత్ర

భువనగిరి పట్టణంలో శోభాయాత్రకు ఆటంకం కలగకుండా అధికారులు రూట్‌ మ్యాప్‌ రూపొందించారు. ఐదు రూట్లలో శోభాయాత్ర కొనసాగనుంది. తొలి శోభాయాత్ర సమ్మద్‌ చౌరస్తాలో ప్రారంభం కానుంది.

ఫ రూట్‌ నంబర్‌–1: రాంనగర్‌, న్యూరాంనగర్‌, ఇం ద్రానగర్‌, ఎల్బీ నగర్‌, రామడక్‌ చౌరస్తా నుంచి బయలుదేరి షియా మసీద్‌, కుడి మలుపు, షియా మసీద్‌, ఖాజీమొహల్లా బాలికల పాఠశాల మీదుగా సమద్‌ చౌరస్తా వైపు విగ్రహాలు కదులుతాయి. కుడి మలుపు కుమ్మరివాడ వైపు నుంచి మసీడ్‌, ప్రిన్స్‌ కార్నర్‌, జగదేవ్‌పూర్‌ ఎక్స్‌ రోడ్డు, ప్రభుత్వ ఆస్పత్రి, హైదరాబాద్‌ చౌరస్తా నుంచి పెద్ద చెరు వుకు శోభాయాత్ర చేరుకుంటుంది.

ఫ రూట్‌ నంబర్‌–2 : హనుమాన్వాద, సంజీవ్‌ నగర్‌, శ్రుతీనగర్‌ అర్బీనగర్‌, అర్బన్కాలనీ నుంచి శోభాయాత్ర మొదలై పాతబస్టాండ్‌, వినాయక చౌరస్తా, కొత్తబస్టాండ్‌ ప్రిన్స్‌ కార్నర్‌ వైపునుంచి వస్తుంది. ప్రిన్స్‌ కార్నర్లో రూట్‌ నంబర్‌–1 నుంచి వచ్చిన శోభాయాత్రతో కలిసి ప్రభుత్వ ఆస్పత్రి, హైదరాబాద్‌ చౌరస్తా మీదుగా పెద్ద చెరువుకు చేరుకుటుంది.

ఫ రూట్‌ నంబర్‌–3 : టీచర్స్‌ కాలనీ, బాహర్పేట్‌, హౌసింగ్‌ బోర్డుకు చెందిన విగ్రహాల శోభాయాత్ర ఎల్బీనగర్‌ నుంచి ప్రారంభమై బాహర్పేట్‌ మసీద్‌, హైదరాబాద్‌ చౌరస్తా కుడి మలుపు, జలీలురా మసీద్‌, శంకర్‌ విల్లాస్‌, చొక్‌ మసీద్‌, సమద్‌ చౌరస్తా ఎడమ మలుపు తిరిగి కుమ్మ రివాడ వైపు కదులుతాయి. ఆజాద్‌ రోడ్డు, ప్రిన్స్‌ కార్నర్‌ నుంచి హైదరాబాద్‌ చౌరస్తా మీదుగా చెరువు వరకు శోభాయాత్ర చేరుతుంది.

ఫ రూట్‌ నంబర్‌–4 : బంజారాహిల్స్‌, తారకరామా నగర్‌, కిసాన్నగర్‌, గంజ్‌ ప్రాంతానికి చెందిన విగ్రహాలు కరెంట్‌ ఆఫీస్‌, కుడివైపు వినాయకచౌరస్తా, కొత్త బస్టాండ్‌, ప్రిన్స్‌ కార్నర్‌ మీదుగా ప్రధాన రహదారి వైపు కదులుతాయి. ప్రిన్స్‌ కార్నర్‌ వద్ద రూట్‌ నంబర్‌–1నుంచి వచ్చిన శోభాయాత్రతో కలుస్తుంది.

ఫ రూట్‌ నంబర్‌ 5: తాతానగర్‌, ప్రగతినగర నుంచి శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. ప్రభుత్వ ఆస్పత్రి, హైదరాబాద్‌ చౌరస్తా, భోంగీర్‌ ట్యాంక్‌ వద్ద ప్రధాన రహదారి మీదుగా పెద్దచెరువు వద్దకు చేరుకుంటుంది.

భువనగిరి పెద్ద చెరువు వద్ద నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లు

జిల్లాలో నేడు, రేపు శోభాయాత్రలు, నిమజ్జనం

ఫ అంతటా 3,599 గణపతి విగ్రహాలు

ఫ అన్ని ఏర్పాట్లు చేసిన యంత్రాంగం

గణేష్‌ నిమజ్జనానికి సిద్ధం 1
1/2

గణేష్‌ నిమజ్జనానికి సిద్ధం

గణేష్‌ నిమజ్జనానికి సిద్ధం 2
2/2

గణేష్‌ నిమజ్జనానికి సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement