
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తిచేయాలి
తుర్కపల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి కేటాయించిన 25 ఇళ్లకుగాను బుధవారం ఆయన 15 ఇళ్లకు స్వయంగా భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మిగతా అర్హులందరికీ రెండవ విడతలో ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే మహిళ సంఘాల ద్వారా ఒక్కొక్కరికి రూ.లక్ష వరకు సాయం చేస్తామన్నారు. వికలాంగుల కోసం బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో 50 బస్తాల సిమెంట్ అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఐనాల చైతన్య మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దనావత్ శంకర్ నాయక్, చాడ భాస్కర్‌రెడ్డి, మోహన్‌బాబు, రాజరాం నాయక్, వెంకటేష్, అంజిరెడ్డి, సుదకర్ నాయక్, మారగోనివెంకట్‌ష్‌గౌడ్, బాలకృష్ణ, అయిలయ్య, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
సర్వే పక్కాగా నిర్వహించాలి
భువనగిరిటౌన్ : పంటకోత ప్రయోగాల సర్వేను పక్కాగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. పంటకోత ప్రయోగాల డిజిటల్ యాప్‌పై వ్యవసాయ శాఖ సిబ్బందికి బుధవారం భువనగిరి కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. సేకరించిన వివరాలను సమయానికి డీజీసీఈఎస్ యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రమణ మాట్లడుతూ సేకరించిన వివరాలను సమయానికి యాప్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఏఓ వెంకటరమణ, నీలిమ, ఎంపీఓలు, ఏఈలు, అధికారులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
తుర్కపల్లి: విద్యార్థులు న్యాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవిలత అన్నారు. బుధవారం తుర్కపల్లి మండలం మాదాపూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలన, బాలకార్మిక వ్యవస్థ నిషేధం, వికలాంగులు, బాలల హక్కులు, బాలల ఆధార్ నమోదు, మానవ అక్రమ రవాణా, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, పోక్సో చట్టం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పలు అంశాలపై లఘు చిత్రాలను ప్రదర్శించి విద్యార్థులకు చూపించారు. అనంతరం బొమ్మలరామారాం, తుర్కపల్లి బాలల సంరక్షణ కేంద్రాలను సందర్శించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ న్యాయ సహా య న్యాయవాది నాగరాజు, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అధికారుల సూచనలు పాటించాలి
భువనగిరి : పంటల సాగులో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ ఎం.యాకాద్రి రైతులకు సూచించారు. భువనగిరి మండలం వీరవెల్లి, కూనూరు గ్రామాల్లో బుధవారం ఆయన వరి, పత్తి పంటలను పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని మాట్లాడారు. కార్యక్రమంలో రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీలత, డాక్టర్ అనిల్‌కుమార్, ప్రొఫెసర్స్ వేణు, రాజేష్, అనుదీప్, రైతు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తిచేయాలి

ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తిచేయాలి