
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
సాక్షి,యాదాద్రి : ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా భువనగిరి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మోడల్ కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ)ను బుధవారం ఆయన.. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ద్వారా స్వయం సహాయక సంఘాలు ఆధ్వర్యంలో డిజిటల్ సేవలు, బ్యాంక్ లావాదేవీలు, ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో అందించబడతాయని అన్నారు. గ్రామీణ మహిళలను గ్రామ స్థాయి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో భాగంగా కామన్ సర్వీస్ సెంటర్ల ఏర్పాటు చేయిస్తోందన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సీఎస్‌సీ కేంద్రాల ద్వారా డిజిటల్ సేవలు పొద్దవచ్చన్నారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తిలో భాగంగా కలెక్టరేట్‌లో మహిళా శక్తి క్యాంటీన్. సీఎస్‌సీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.5.00 కోట్లతో జిల్లా సమాఖ్య భవనం నిర్మిస్తున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, జెడ్పీ సీఈఓ శోభారాణి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా మేనేజర్ బుగ్గ శ్రీధర్ పాల్గొన్నారు.
ఫ భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి