ఏసీబీకి చిక్కిన చేప | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన చేప

Sep 5 2025 4:49 AM | Updated on Sep 5 2025 7:41 AM

ఏసీబీకి చిక్కిన చేప

ఏసీబీకి చిక్కిన చేప

నల్లగొండ టూటౌన్‌: మత్స్యశాఖలో ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించుకొని అందినకాడికి దండుకున్న నల్లగొండ జిల్లా మత్స్యశాఖ అధికారిణి చరిత గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నల్లగొండ జిల్లాలో ఓ మత్స్యకార సహకార సంఘంలో కొత్తగా 17 మంది సభ్యులకు సభ్యత్వం కల్పించడానికి మత్స్యకారులు చరితను ఆశ్రయించారు. ఇందుకు రూ.70వేలు ఇస్తేనే కొత్త వారికి సొసైటీలో సభ్యత్వం ఇస్తామని చెప్పడంతో వారు రూ.50వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవల సొసైటీ వారు ఏసీబీని ఆశ్రయించారు. గురువారం రూ. 50వేలు ఇస్తామని చెప్పిన సొసైటీ బాధ్యులు మత్స్యశాఖ కార్యాలయంలో ఆమె చాంబర్‌లోకి వెళ్లి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదేవిధంగా ఏసీబీ అధికారులు మత్స్యశాఖ కార్యాలయంతో పాటు హైదరాబాద్‌లోని వనస్థలిపురంలోని ఆమె నివాసంలో సోదాలు చేశారు. కాగా.. చరిత నల్లగొండ మండలంలోని మేళ్లదుప్పలపల్లి గ్రామం కాగా కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివాసం ఉంటున్నారు.

అవినీతికి అగ్రతాంబూలం

మత్స్యశాఖ అధికారిణి చరిత దీర్ఘకాలంగా జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో పని చేశారు. ఇక్కడ పని చేసిన రోజుల్లోనే ఆమె అవినీతి అక్రమాలపై ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. 2015– 16 సంవత్సరంలో ఉచిత చేప పిల్లల పంపిణీలో భారీ అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్‌ అధికారులు కూడా తేల్చారు. ఉచిత చేపపిల్లలు పంపిణీ చేయకుండానే పంపిణీ చేసినట్లు అడ్డంగా దొరికినా రాజకీయ అండదండలతో బయటపడిందనే చర్చ అప్పట్లోనే జరిగింది. గుర్రంపోడు, పీఏపల్లి తదితర మండలాల్లో చెరువుల ఆనవాళ్లు కూడా లేవని మత్స్యశాఖ నుంచి వచ్చిన విచారణ అధికారుల తనిఖీల్లో బయపడిన విషయం తెలిసిందే. అయినా ఆమైపె ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఆయా అక్రమాలు, చేపల చెరువులు, చేప పిల్లల పంపిణీకి సంబంధించి సాక్షి పలు కథనాలు ప్రచురించింది. ప్రభుత్వం రెండేళ్ల పాటు చరితను వేరే జిల్లాకు డిప్యూటేషన్‌పై పంపింది. గతేడాది డిప్యూటేషన్‌ రద్దు చేయించుకొని జిల్లా మత్స్యశాఖ అధికారిగా వచ్చారు. గతేడాది కూడా ఉచిత చేప పిల్లల పంపిణీలో భారీ అక్రమాలు జరిగాయనే కారణంతో కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా నిలిపివేసిన విషయం తెలిసిందే. కానీ సదరు అధికారి మాత్రం అన్ని చెరువుల్లో చేప పిల్లలు పోసినట్లు బిల్లులు పెట్టడం గమనార్హం. అదే విధంగా గత ప్రభుత్వంలో మత్స్యకారులకు ఇచ్చిన వాహనాల పంపిణీలో కూడా భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఫ రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన నల్లగొండ జిల్లా

మత్స్యశాఖ అధికారిణి

ఫ గతంలో చేప పిల్లల పంపిణీలో

అక్రమాలకు పాల్పడినట్లు తేల్చిన విజిలెన్స్‌ అధికారులు

ఫ మత్స్యకారులకు వాహనాల పంపిణీలో కూడా భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement