
సాహో.. మాస్టారు
బడిని బతికించిన మాస్టారు
శాలిగౌరారం: విద్యార్థులు లేక రెండేళ్ల పాటు మూతబడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తిరిగి విద్యార్థులను చేర్పించి ఆ మాస్టారు పాఠశాలకు ప్రాణం పోశారు. శాలిగౌరారం మండలం తుడిమిడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు చేరకపోవడంతో 2023 నుంచి 2025 వరకు పాఠశాల మూతబడింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు చౌగోని శ్రీనివాస్‌గౌడ్ డిప్యూటేషన్‌పై బండమీదిగూడెం పాఠశాలకు వెళ్లారు. అయినా అతడు మూతబడిన తుడిమిడి పాఠశాలను తెరిపించేందుకు రెండేళ్లుగా శ్రమిస్తూనే ఉన్నారు. కానీ ఈసారి బడులు తెరవకముందే నెలరోజుల పాటు నిత్యం గ్రామానికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్చించాలని, తాను పూర్తిగా ఇంగ్లిష్ మీడియంతో పాటు ప్రత్యేక అభ్యసన పద్ధతులతో చదువు చెబుతానని విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. ఈ క్రమంలో శాలిగౌరారం మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను సైతం వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు సిద్ధం కావడంతో ప్రస్తుత విద్యాసంవత్సరంలో 13 మంది విద్యార్థులు తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేరారు. గ్రామస్తుల సహకారంతో పాఠశాలను సుందరీకరించి పచ్చని తోరణాల నడుమ పాఠశాలను ఓ విద్యార్థినితో ఈ ఏడాది తిరిగి ప్రారంభించారు.
నకిరేకల్: నకిరేకల్ మండలం పాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు తాటిపాముల నర్సింహమూర్తి ప్రతిరోజు అరగంట ముందుగానే పాఠశాలకు వచ్చి 4వ తరగతి విద్యార్థులకు గురుకుల ఎంట్రెన్స్ శిక్షణ ఇస్తున్నారు. వేసవి సెలవుల్లో సహచర ఉపాధ్యాయులతో కలిసి బాల విజ్ఞాన వినోదిని పేరుతో శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఆటపాటలతో కూడిన విజ్ఞానాన్ని అందించి ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చేశారు. విద్యార్థులకు పుస్తక పఠనం అలవాటు చేస్తూ.. పాఠశాలలో గ్రంఽథాలయ ఏర్పాటుకు మార్గం వేశారు. విద్యార్థులే స్వయంగా సాహిత్యం, కథలు రాసేలా ప్రోత్సహిస్తున్నారు.
మోత్కూరు: మోత్కూరు మండలం పాలడుగు ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వై. కమలాకర్‌రెడ్డి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. వీడియోల రూపంలో పాఠ్యాంశాలు, సామాజిక అంశాలు బోధిస్తూ చదువుపై విద్యార్థులకు ఆసక్తి పెంచుతున్నారు. నైతిక విలువలు, నడవడికలు, సామాజిక స్పృహ తదితర అంశాలపై స్వయంగా వీడియో రూపొందించి తాను ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూపుల్లో ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చూసే విధంగా పంపుతున్నారు. వారి నుంచి వచ్చిన స్పందన అనంతరం యూట్యూబ్‌లలో అప్‌లోడ్ చేసి విద్యార్థులకు చూపిస్తూ వివరిస్తున్నారు. తానే స్వయంగా పాటలు రాయడం, పాడటం, సంగీతం రూపొందిస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా బోధన చేస్తూ ప్రధానోపాధ్యాయుడు కమలాకర్ విద్యార్థుల ఆదరాభిమానాలు పొందుతున్నారు. విద్యార్థులతో జాతీయ నాయకుల వేషధారణ వేయించి వారి జీవిత చరిత్రను చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి విద్యార్థుల్లో చైతన్యం నింపుతున్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు, వాటి ప్రాముఖ్యతను యూట్యూబ్ ద్వారా వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు. సుమారు 500 కథలు, బడి బాటపై సుమారు 300 పాటలు రాసి యూట్యూబ్ ద్వారా విద్యార్థులకు బోధించినట్లు ప్రధానోపాధ్యాయుడు కమలాకర్ వివరించారు.
ట్రెండ్ ఫాలో అవుతున్న ప్రధానోపాధ్యాయుడు

సాహో.. మాస్టారు

సాహో.. మాస్టారు

సాహో.. మాస్టారు

సాహో.. మాస్టారు

సాహో.. మాస్టారు

సాహో.. మాస్టారు