
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
బొమ్మలరామారం: ప్రాథమిక స్థాయి నుంచి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి జానీ అఫ్గాన్ అన్నారు. బొమ్మలరామారం మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో గురువారం నిర్వహించిన మండల స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్య సులభంగా అర్థమయ్యే రీతిలో బోధిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో సీఎంవో లింగారెడ్డి, ఎంపీడీఓ రాజా త్రివిక్రమ్, ఎంఈఓ రోజారాణి, పీఈటీ నర్సింహ పాల్గొన్నారు.