
నేత్రపర్వంగా ఊంజల్ సేవ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం నేత్రపర్వంగా చేపట్టారు. శుక్రవారం సాయంత్రం అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ఆలయ తిరు, మాడీ వీధుల్లో ఊరేగించారు. మహిళలు మంగళ హారతులతో అమ్మవారికి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజలి సేవోత్సవం నిర్వహించారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజా కార్యక్రమాలు కొనసాగాయి. వేకుజామున సుప్రభాత సేవ, ఆరాధన, గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, సమష్రనామార్చాన తదితర పూజలు నిర్వహించారు.