
ఘనంగా మరియమాత ఉత్సవాలు
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని మరియరాణి చర్చిలో మరియమాత ఉత్సవాలను శుక్రవారం క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ కరణం ధమన్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం దివ్యబలి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏసు ప్రభువు తల్లి మరియరాణి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సాయంత్రం మరియరాణి స్వరూపాన్ని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ బిషప్ గణ గోవింద్ జోజి, విచారణ ఫాదర్ జి. బాలస్వామి, అర్లారెడ్డి, బాలరాజు, చర్చి పెద్దలు తదితరులు పాల్గొన్నారు.