
సాగు జలాలు ఇచ్చే వరకు పోరాడాలి
సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం ప్రాంతానికి సాగు జలాలు అందించే ఇక్కడి ప్రజలు పోరాడాలని అఖిల భారత రైతు సంఘం జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో రాచకొండ ఎత్తిపోతల పథక సాధన సదస్సును శుక్రవారం సంస్థాన్ నారాయణపురంలో నిర్వహించారు. ఈ సదస్సులో రిటైర్డ్ ఇంజనీర్ ఫోరం నాయకుడు పి. ఇంద్రసేనారెడ్డి పాల్గొని రాచకొండ ఎత్తిపోతల పథకానికి నీళ్లు ఎలా తీసుకురావచ్చనే డీపీఆర్‌ను వివరించారు. ఈ సందర్భంగా సారంపల్లి మాల్లారెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని చిన్న చిన్న ప్రాజెక్టులకు రూ.500కోట్ల చొప్పున కేటాయిస్తే పూర్తయ్యే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌లో ఇరిగేషన్‌కు రూ.22,304 కోట్లు కేటాయించి, అందులో రూ.10వేల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణం కోసం వెచ్చించారని, మిగిలిన బడ్జెట్‌లో రూ.800 కోట్లు వేతనాలకు, రూ.11,500 కోట్లతో వడ్డీలు చెల్లిస్తున్నారని అన్నారు. మూసీ నది ప్రక్షాళన కోసం ప్రభుత్వం రూ.15వేల కోట్లు వెచ్చిస్తామని చెప్పి రూ.1500 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. మూసీ ప్రక్షాళన కంటే ముందు హైదరాబాద్ నుంచి కాలుష్యంకారక కంపెనీ తరలించాలని డిమాండ్ చేశారు. ఎరువుల కొరతకు కారణం వ్యవసాయ శాఖ మందస్తు ప్రణాళికలు రూపొందించకపోవడమేనని అన్నారు. మునుగోడు నియోజకవర్గానికి నీళ్లు ఎక్కడ నుంచి తెస్తారో తీసుకురావాలి కాని, అలోచనలు మార్చుతూ కాలయాపన చేయొద్దన్నారు. సాగు జలాలు అందించే వరకు దీర్ఘకాలిక పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గత బీఆర్‌ఎస్ నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వరకు అరాచక పాలన కొనసాగిస్తున్నాయని అన్నారు. రిటైర్డ్ ఇంజనీర్ ఫోరం నాయకుడు పి. ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. రాచకొండ ఎత్తిపోతల పథకానికి కృష్ణా, గోదావరి జలాలు అందించే అవకాశాలను వివరించారు. ఈ పథకం నిర్మాణం పూర్తయితే ఎన్ని మండలాలకు సాగు జలాలు అందుతాయని వివరించారు. అంతకుముందు నారాయణపుంర చౌరస్తా నుంచి సదస్సు నిర్వహించే ప్రదేశం వరకు ర్యాలీ నిర్వంచారు. ఈ సదస్సులో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, సుర్కంటి శ్రీనివాస్‌రెడ్డి, గుంటోజు శ్రీనివాస్‌చారి, దోడ యాదిరెడ్డి, దోనూరి నర్సిరెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, దొంతగోని పెద్దులు, ఐతరాజు గాలయ్య, మల్లేపల్లి లలిత, చింతకాయల నర్సింహ, రాములు, నరసింహ, యాదవరెడ్డి, శంకరయ్య, భిక్షం, నిర్మాల, అమరేందర్ తదితరులున్నారు.
రాచకొండ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను వివరిస్తున్న రిటైర్డ్ ఇంజనీర్ ఫోరం నాయకుడు ఇంద్రసేనారెడ్డి
ఫ అఖిల భారత రైతు సంఘం
జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు
సారంపల్లి మల్లారెడ్డి

సాగు జలాలు ఇచ్చే వరకు పోరాడాలి

సాగు జలాలు ఇచ్చే వరకు పోరాడాలి