
డీసీసీబీని సందర్శించిన నాబార్డు సీజీఎం
నల్లగొండ టౌన్: నల్లగొండలోని డీసీసీబీని శుక్రవారం నాబార్డు సీజీఎం ఉదయ్‌భాస్కర్ సందర్శించారు. ఆయన డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నాబార్డు స్కీంలు, డీసీసీబీల అభివృద్ధిలో నాబార్డు పాత్ర వంటి విషయాలపై సీజీఎం మాట్లాడారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. నాబార్డు అందిస్తున్న అనేక పథకాలు, రీఫైనాన్స్‌తో డీసీసీబీలు, సొసైటీలు బలోపేతమయ్యాయన్నారు. ఉమ్మడి జిల్లాలో మరో ఆరు కొత్త బ్రాంచీల ఏర్పాటు, ప్రాథమిక సహకార సంఘాలకు గోదాంల నిర్మాణానికి కొత్త స్కీమ్‌లు ఏర్పాటుచేయాలని ఈ సందర్భంగా సీజీఎంను ఆయన కోరారు. సమావేశంలో డీసీసీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, శంకర్‌రావు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.