సాంకేతిక నైపుణ్యం.. ఉపాధి మార్గం | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక నైపుణ్యం.. ఉపాధి మార్గం

Aug 22 2025 3:03 AM | Updated on Aug 22 2025 3:03 AM

సాంకే

సాంకేతిక నైపుణ్యం.. ఉపాధి మార్గం

నేషనల్‌, మల్టీనేషనల్‌ కంపెనీలతో ఒప్పందం అధునాతన సాఫ్ట్‌వేర్‌ పరికరాలు వచ్చాయి

పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు

ఆలేరు: గ్రామీణ యువతలో శిక్షణ నైపుణ్యాలు పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు, భువనగిరిలో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ)ల నిర్మాణాలు చేపట్టింది. ఆలేరులోని పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)ఆవరణలో, భువనగిరిలో మిషన్‌ భగీరథ కార్యాలయం సమీపంలో ఒక్కొక్కటి 13వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గతేడాది ఈ పనులు మొదలుపెట్టారు. ఒక్కో ఏటీసీ నిర్మాణానికి రూ.35కోట్ల చొప్పున మొత్తం రూ.70కోట్ల నిధులతో నిర్మించారు. ఇందులో 85శాతం నిధులను టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌(టీటీఎల్‌)సమకూర్చగా, ఏటీసీల నిర్మాణం, విద్యుద్దీకరణ తదితర పనులకు మిగతా 15శాతం నిధులను ప్రభుత్వం వ్యయం చేసింది. ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తి కావడంతో వచ్చే నెలలో వీటిని ప్రారంభించనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రెండు సెంటర్లలో 344 సీట్లు

ఏడాది, రెండేళ్ల కాలపరిమితికిగాను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కోర్సుల్లో ఒక్కో సెంటర్లో 172 సీట్ల చొప్పున 344 సీట్లు ఉన్నాయి. ఏటీసీల్లో లక్ష్యం మేరకు ప్రవేశాల పూర్తికి కలెక్టర్‌ హనుమంతరావు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఈ విషయమై దృష్టిసారించాలని జిల్లా యంత్రాంగానికి కలెక్టర్‌ ఆదేశించారు. ఇప్పటికే ఆలేరులో 64, భువనగిరిలో 72 అడ్మిషన్లు జరిగాయి. ప్రవేశాల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు ఈనెల 28తో గడువు ముగియనుంది.

ఏటీసీల్లో సంవత్సరం, రెండేళ్ల కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టాటా, టాటా నెల్కో, టెక్‌ ఎక్స్‌పర్ట్‌, డెల్‌, ఇన్ఫోసిస్‌ తదితర నేషనల్‌, మల్టీనేషనల్‌ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మరికొన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలతో అధికారులు చర్చలు చేస్తున్నారు. అదేవిధంగా ‘టీగేట్‌’ (తెలంగాణ గేట్‌వే అడాప్ట్‌ ట్రైనింగ్‌ ఎంప్లాయిమెంట్‌) వివిధ పారిశ్రామికవేత్తలతో శిక్షణ పొందిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయమై చర్యలు జరుపుతోంది. పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా ఏటీసీల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా టీగేట్‌ చర్యలు తీసుకుంటుంది.

ఆలేరు, భువనగిరిలోని ఏటీసీల్లో శిక్షణ కోసం అన్ని ఆధునాతన సాఫ్ట్‌వేర్‌ పరికరాలు వచ్చాయి. విద్యార్థులకు వివిధ కోర్సుల్లో శిక్షణ, సిలబస్‌ బోఽధించేందుకు ఎనిమిది మంది ప్రత్యేక నిపుణులను టీటీఎల్‌ నియమించింది. ఆయా యంత్రాలను ఏటీసీల్లో సాంకేతిక బృందం బిగిస్తోంది.

– హరికృష్ణ, ఐటీఐ జిల్లా కన్వీనర్‌

ఫ ఆలేరు, భువనగిరిలో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు సిద్ధం

ఫ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాబ్‌ల ఏర్పాటు

ఫ శిక్షణ తర్వాత ఉద్యోగాలకు మల్టీనేషనల్‌ కంపెనీలతో ఒప్పందం

ఫ వచ్చే నెలలో ప్రారంభానికి ఏర్పాట్లు

పదో తరగతి పాసై, 22ఏళ్లలోపు ఉన్న విద్యార్థులు హెచ్‌టీటీపీఎస్‌//ఐటీఐ.తెలంగాణ. జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత పదో తరగతి మెమో, కుల ధ్రవీకరణ పత్రం, బోనఫైడ్‌ సర్టిఫికెట్‌, టీసీతోపాటు ఆధార్‌కార్డు ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో స్థానిక ఐటీఐ కళాశాలల్లో సంప్రదించాలి.

కోర్సులు, సీట్ల వివరాలు (కాలపరిమితి ఏడాది)

కోర్సు సీట్లు

మానుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ ఆటోమేషన్‌ 40

ఇండస్ట్రియల్‌ రోబోటిక్స్‌, డిజిటల్‌

మ్యానుఫ్యాక్చరింగ్‌ టెక్నీషియన్‌ 40

ఆర్టీసియన్‌ యూజింగ్‌ అడ్వాన్స్‌డ్‌ టూల్స్‌ 20

బేసిక్‌ డిజైనర్‌, వర్చువల్‌ వెరిఫయర్‌(మెకానికల్‌) 24

అడ్వాన్స్‌డ్‌ సీఎన్‌సీ మిషనింగ్‌ టెక్నీషియన్‌ 24

మెకానిక్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ 24

సాంకేతిక నైపుణ్యం.. ఉపాధి మార్గం 1
1/2

సాంకేతిక నైపుణ్యం.. ఉపాధి మార్గం

సాంకేతిక నైపుణ్యం.. ఉపాధి మార్గం 2
2/2

సాంకేతిక నైపుణ్యం.. ఉపాధి మార్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement