ఉత్సవం.. సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

ఉత్సవం.. సన్నద్ధం

Aug 22 2025 3:03 AM | Updated on Aug 22 2025 3:03 AM

ఉత్సవ

ఉత్సవం.. సన్నద్ధం

న్యూస్‌రీల్‌

ప్రజలు సహకరించాలి

ప్రతి మండపాన్ని విద్యుత్‌

అధికారులు సందర్శిస్తారు

శుక్రవారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2025

ఉపాధ్యాయుల పదోన్నతుల రీషెడ్యూల్‌ విడుదల

భువనగిరి: ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన రీ షెడ్యూల్‌ను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఉపాధ్యాయులకు సంబంధించిన పదోన్నతుల ప్రక్రియ మొదటగా ప్రకటించిన షెడ్యుల్‌ ప్రకారం ఈనెల 11న పూర్తికావాల్సి ఉంది. 2002 నవంబర్‌లో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు సీనియార్టీ విషయంలో కోర్టులో పిటిషన్‌ వేసిన కారణంగా పదోన్నతుల ప్రక్రియ వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన కారణంగా తిరిగి ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి రీ షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో పాటు వెంటనే మల్టీజోన్‌–2 పరిధిలో జరిగే జీహెచ్‌ఎంల పదోన్నతుల జాబితాను ప్రకటించింది. ఈమేరకు జిల్లాలో ఖాళీగా ఉన్న 34 జీహెచ్‌ఎం పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ కానున్నాయి. అనంతరం జిల్లాలో సుమారు 100 వరకు స్కూల్‌ అసిస్టెంట్లు, పీఎస్‌హెచ్‌ఎంలకు సంబంధించి పదోన్నతుల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే తయారు చేసిన సుమారు 300 మది సీనియార్టీలకు సంబంధించిన సర్టిఫికెట్స్‌ పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ రీషెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 24 వరకు జరగనుంది. ఈ నెల 25న వెబ్‌ ఆప్షన్‌, పదోన్నతులు పొందిన వారికి 26న ఆర్డర్లు జారీ చేయనున్నారు. జీహెచ్‌ఎంల పదోన్నతులకు సంబంధించి కూడా ఆర్డర్లు జారీ చేశారు.

యూరియా కోసం ఆందోళన చెందొద్దు

ఆలేరురూరల్‌: యారియా కోసం రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి అన్నారు. గురువారం ఆలేరు పట్టణంలోని ఫర్టిలైజర్‌ దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. ఇప్పటివరకు జిల్లాకు 17వేల మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు. దుకాణ యాజమానులు రైతులకు అవసరం ఉన్న ఎరువులు ఇవ్వాలని, వేరే వాటిని అంటకట్టొద్దన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు అమ్మాలని, ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మందనపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఆమె వెంట ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్‌, ఎంపీఓ అనురాధ, ఏఓ శ్రీనివాస్‌, ఏఈఓ మండల అధికారులు తదితరులున్నారు.

బంగారు భవిష్యత్‌ను నిర్మించుకోవాలి

చౌటుప్పల్‌ : విద్యార్థులు చక్కటి విద్యాభ్యాసంతో బంగారు భవిష్యత్‌ను నిర్మించుకోవాలని రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ ప్రధాన కార్యదర్శి రమణకుమార్‌ అన్నారు. చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను గురువారం ఆయన సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, హాస్టల్‌ భవనం, గురుకుల పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యంతో చదువుకుంటే భవిష్యత్‌లో ఉన్నత స్థాయిలో ఉండొచ్చన్నారు. ఉపాద్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బోధించడం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయన్నారు. ఆయన వెంట ప్రిన్సిపాల్‌ స్మిత, ఉపాధ్యాయులు ఉన్నారు.

సాక్షి, యాదాద్రి : గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం కోసం జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు జరగడానికి పలు జాగ్రత్తలు రూపొందించారు. ఈనెల 27న వినాయక చవితి పండుగ రోజు నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో గల ఆరు మున్సిపాలిటీలు, 17 మండలాల్లో ఈసారి సుమారు నాలుగు వేల వినాయక మండపాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గత సంవత్సరం 3,600కు పైగా మండపాలు ఏర్పాటు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వివిధ శాఖల సమన్వయంతో..

విద్యుత్‌ శాఖ, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ పంచాయతీ రాజ్‌, మత్స్యశాఖ, అగ్నిమాపక శాఖ, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ అధికారులందరినీ సమన్వయం చేస్తున్నారు. శోభాయాత్రకు అడ్డంకిగా రహదారుల వెంట ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం, రోడ్లకు మరమ్మతులు వంటి పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు.

తాత్కాలిక విద్యుత్‌ కనెక్షన్‌

ప్రతి మండపం నిర్వాహకులు డీడీ చెల్లిస్తే విద్యుత్‌ శాఖ సిబ్బంది కరెంట్‌ పోల్‌ నుంచి తాత్కాలిక విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తారు. అనుకోని పరిస్థితిలో ప్రమాదం జరిగితే విద్యుత్‌ శాఖ నుంచి పరిహారం అందుతుంది. ఇందుకోసం 250 కిలో వాట్స్‌కు రూ.500, 500కిలో వాట్స్‌కు రూ.1000, 1000 కిలో వాట్స్‌ వరకు రూ.1500తోపాటు ప్రతి కిలోవాట్స్‌కు రూ.750 చెల్లించాలి. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా కిందికి వేలాడే కరెంటు తీగలు, వంగి ఉన్న చెట్ల కొమ్మలు ఉంటే తొలగించనున్నారు. అయితే విగ్రహాల ఎత్తు సమాచారం ముందుగానే తీసుకుంటారు.

అందుబాటులో గజ ఈతగాళ్లు

వినాయక నిమజ్జనోత్సవం కోసం చెరువుల వద్ద గజఈత గాళ్లను అందుబాటులో ఉంచుతున్నారు. క్రేన్‌, లైటింగ్‌ వ్యవస్థ, అత్యవసర వైద్యం, తాగునీరు, బారికేడ్లు, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, పారిశుద్ధ్యం వంటి చర్యలు ఆయా శాఖలు చేపట్టనున్నాయి. ప్యాచ్‌ వర్క్‌ చేపట్టి రోడ్లపై ఏర్పడిన గుంతలను మూసివేయాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. చెరువుల వద్ద సరిపడా సంఖ్యలో క్రేన్‌లను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు ఏర్పాటు చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యే వరకు అధికారులు పర్యవేక్షణ కొనసాగనుంది.

చెరువుల వద్ద భద్రత ఏర్పాట్లు

ప్రతి మండపానికి అనుమతి తప్పనిసరి. ఇందుకోసం poiceportal.tspoice.gov.in లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోలీసులు ఇచ్చిన అనుమతి కాపీని మండపంలో కనిపించే విధంగా ప్రదర్శించాలి. ప్రతి మండపాన్ని జియో ట్యాగింగ్‌ చేయనున్నారు. డీజేలకు అనుమతి లేదు. అనుమతి ఇచ్చిన మేరకు రాత్రి పది గంటల లోపు మైక్‌లు కట్టేయాలి. ప్రతిరోజు ప్రతి మండపాన్ని బ్లూకోట్స్‌ పోలీస్‌లు, పెట్రో మొబైల్‌ కానిస్టేబుళ్లు విజిట్‌ చేస్తారు. అక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుని పరిష్కరిస్తారు. మండపాల వద్ద ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. నిమజ్జనానికి అవసరమైన రూట్‌మ్యాప్‌ను ముందుగానే పోలీస్‌ శాఖకు అందివ్వాలి. నిమజ్జనం కోసం భువనగిరి పెద్ద చెరువు, బీబీనగర్‌ చెరువు, యాదగిరిగుట్ట, గోధుమకుంట, చౌటుప్పల్‌ చెరువులతో పాటు స్థానిక చెరువుల వద్ద భద్రతా ఏర్పాటు చేస్తున్నారు.

మంజూరైనవి 1,764..

నిర్మాణం పూర్తయినవి12

వానాకాలానికి ముందే పూర్తిచేయాల్సి ఉండగా నీరుగారుతున్న లక్ష్యం

ఫ గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ప్రణాళిక

ఫ ప్రతి మండపానికి అనుమతి తప్పనిసరి

ఫ రాత్రి పది గంటల లోపు

మైక్‌లు కట్టేయాలి

ఫ మండపాలను విజిట్‌ చేయనున్న పోలీసులు, పెట్రో మొబైల్‌ కానిస్టేబుళ్లు

ఫ డీడీ చెల్లిస్తే మండపాలకు

విద్యుత్‌పోల్‌ నుంచి కనెక్షన్‌

గణేష్‌ నవరాత్రులు, నిమజ్జనం సందర్భంగా ప్రజలు సహకరించాలి. ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలి. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు అన్నివర్గాల ప్రజలు సహకరించాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాం. నిమజ్జనం చేసే ముందు పోలీసులకు సమాచారం ఇస్తే ఏర్పాట్లు చేస్తారు.

– అక్షాంశ్‌ యాదవ్‌, డీసీపీ

ప్రతి మండపానికి ఒక లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, ఒక లైన్‌మన్‌తోపాటు ఇద్దరు ఆర్టిజన్‌ సిబ్బందిని బాధ్యులను చేశాం. ప్రతిరోజు విద్యుత్‌ అధికారులు మండపాన్ని సందర్శించాలి. డీడీ చెల్లిస్తే విద్యుత్‌పోల్‌ నుంచి కనెక్షన్‌ ఇస్తాం. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ట్రిప్‌ అయి ప్రమాదం జరగకుండా ఎంసీపీ ఏర్పాటు చేస్తాం.

– సుధీర్‌కుమార్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ

ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

గణేష్‌ ఉత్సవాలు, మిలాద్‌– ఉన్‌– నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కలెక్టర్‌ హనుమంతరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో పీస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. గణేష్‌ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మతపెద్దలు, మండపాల నిర్వాహకులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌, ఏఎస్‌పీ రాహుల్‌ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, గ్రంథాలయ చైర్మన్‌ అవేజ్‌ చిస్తీ, రెవెన్యూ డివిజనల్‌ అధికారి మాలి కృష్ణారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, ఏసీపీలు పటోళ్ల మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌ నాయుడు, తహసీల్దార్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఉత్సవం.. సన్నద్ధం1
1/4

ఉత్సవం.. సన్నద్ధం

ఉత్సవం.. సన్నద్ధం2
2/4

ఉత్సవం.. సన్నద్ధం

ఉత్సవం.. సన్నద్ధం3
3/4

ఉత్సవం.. సన్నద్ధం

ఉత్సవం.. సన్నద్ధం4
4/4

ఉత్సవం.. సన్నద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement