నేటి నుంచి అంతర్‌ జిల్లాల అథ్లెటిక్స్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి అంతర్‌ జిల్లాల అథ్లెటిక్స్‌ పోటీలు

Nov 14 2026 1:35 AM | Updated on Nov 14 2026 1:35 AM

నేటి నుంచి అంతర్‌ జిల్లాల అథ్లెటిక్స్‌ పోటీలు జాతీయ స్థాయికి తణుకు బాలిక

పెదవేగి: స్థానిక డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ గురుకులంలో శనివారం నుంచి రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–19 అంతర్‌ జిల్లాల అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరగనున్నట్లు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఏలూరు జిల్లా కార్యదర్శి కే. జయరాజు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ పోటీలకు విద్యాశాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ శేఖర్‌బాబు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని, ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని వెల్లడించారు

తణుకు అర్బన్‌: రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో తణుకుకు చెందిన 2వ తరగతి విద్యార్థిని జి. హన్వి ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపికై ంది. ఇటీవల తాడేపల్లిగూడెంలో మాస్టర్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె రెండో స్థానంలో నిలిచింది. దీని ద్వారా వచ్చే ఏడాది జనవరిలో జరిగే జాతీయ స్థాయి చదరంగం పోటీలకు అర్హత సాధించినట్లు తల్లి మమతా యాదవ్‌ తెలిపారు.

పోటీలకు సిద్ధమైన ఆటస్థలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement