మలి పుర పోరుకు సై | - | Sakshi
Sakshi News home page

మలి పుర పోరుకు సై

Nov 14 2026 1:41 AM | Updated on Nov 14 2026 1:41 AM

మాయమైన పాతయేరు

వృద్ధురాలి హత్యకేసు ఛేదన

పట్టణాల వారీగా..

న్యూస్‌రీల్‌

రేపటి నుంచి పంచాయతీ పోరుకు..

మాయమైన పాతయేరు
ఆకివీడు గుమ్ములూరు రోడ్డు నుంచి చినకాపవరం డ్రెయిన్‌ వరకు మురుగునీటి పారుదల నిమిత్తం ఏర్పాటు చేసిన పాతయేరు కనుమరుగవుతోంది. 8లో u

శనివారం శ్రీ 14 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

సాక్షి, భీమవరం: పుష్కర కాలం తర్వాత జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పురపాలక సంఘాల్లో పుర పోరుకు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. 16 వరకు నామినేషన్లు దాఖలుకు గడువుండగా సప్తమి కలిసిరావడంతో ఆ రోజున అధిక శాతం నామినేషన్లు వేయనున్నారు. ఇదిలా ఉండగా కూటమి పక్షాల్లో వార్డుల పంచాయితీ ఇంకా కొలిక్కిరాలేదు.

నామినేషన్లకు ఏర్పాట్లు : ఎన్నికలు జరుగుతున్న నాలుగు మున్సిపాల్టీల్లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. చైర్మన్‌, వార్డు అభ్యర్థుల కోసం వేర్వేరుగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 17న నామినేషన్ల పరిశీలన, 19న ఉపసంహరణ, 26న పోలింగ్‌, 30న కౌంటింగ్‌ జరుగనున్నాయి. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 188 వార్డులకు పోలింగ్‌ కోసం 443 పోలింగ్‌ కేంద్రాలు, 3,050 మంది సిబ్బందిని ఏర్పాటుచేసినట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, అర్హులైన ఓటర్లంతా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని కోరారు.

తేలని వార్డులు : కూటమిలో వార్డుల సర్దుబాటు ఇంకా కొలిక్కిరాలేదు. భీమవరం, తాడేపల్లిగూడెం చైర్మన్‌ స్థానాలను జనసేన, తణుకు, పాలకొల్లు టీడీపీ పంచుకున్నాయి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీలో ఎవరికెన్ని వార్డులు, ఏ వార్డులు ఎవరు తీసుకోవాలనే విషయమై కూటమి పక్షాలు తీవ్ర తర్జనభర్జనలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రికి వార్డుల సర్దుబాటు పూర్తికాలేదని సమాచారం. మరోపక్క గతంలో వార్డు కౌన్సిలర్లుగా పనిచేసిన పలువురు మాజీలు ప్రస్తుత ఎన్నికల్లో బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కొత్తగా బరిలోకి దిగే ఆశావహులు ఓటర్లు, సామాజిక, ఆర్థికపరమైన అంశాలను భేరీజు వేసుకుంటూ తమకు అనుకూల వార్డులపై కన్నేశారు.

సప్తమి పూట మంచిదని..

నామినేషన్ల స్వీకరణకు మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఆశావహులు ముహూర్తాల వేటలో పడ్డారు. 16న సప్తమి తిథి అత్యంత బలమైనదిగా, కలిసివచ్చే రోజుగా పంచాంగకర్తలు సూచిస్తున్నారు. అధిక శాతం మంది అభ్యర్థులు ఆ రోజే నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఏలూరు రూరల్‌ పోణంగి గ్రామంలో వృద్ధురాలి హత్య కేసును వన్‌టౌన్‌ సర్కిల్‌ పోలీసులు ఛేదించారు. నిందితుడైన యువకుడిని అరెస్ట్‌ చేశారు. 8లో u

భీమవరం: భీమవరంలో చైర్‌పర్సన్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వు కాగా 52 వార్డులకు గాను ఎస్టీలకు ఒకటి, ఎస్సీ మహిళలకు రెండు, ఎస్సీ జనరల్‌కు మూడు, బీసీ మహిళలకు 10, బీసీ జనరల్‌కు 10, జనరల్‌ మహిళలకు 14, జనరల్‌ కేటగిరీకి 12 రిజర్వు చేశారు.

తణుకు: తణుకులో చైర్మన్‌ పదవి జనరల్‌కు రిజర్వు అయ్యింది. 44 వార్డులకు ఎస్టీ జనరల్‌కు ఒకటి, ఎస్సీ మహిళలకు రెండు, ఎస్టీ జనరల్‌కు మూడు, బీసీ మహిళలకు ఎనిమిది, బీసీ జనరల్‌కు ఎనిమిది, జనరల్‌ మహిళలకు 12, జనరల్‌కు 10 రిజర్వయ్యాయి.

తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలో చైర్మన్‌ పదవి జనరల్‌కు రిజర్వు కాగా 48 వార్డులకు ఎస్టీ జనరల్‌కు ఒకటి, ఎస్సీ మహిళలకు మూడు, ఎస్సీ జనరల్‌కు మూడు, బీసీ మహిళలకు ఎనిమిది, బీసీ జనరల్‌కు తొమ్మిది, జనరల్‌ మహిళలకు 13, జనరల్‌కు 11 వార్డులు రిజర్వయ్యాయి.

పాలకొల్లు: పాలకొల్లులో చైర్‌పర్సన్‌ బీసీ మహిళకు రిజర్వు కాగా 44 వార్డులకు ఎస్టీ జనరల్‌కు ఒకటి, ఎస్సీ మహిళలకు మూడు, ఎస్సీ జనరల్‌కు నాలుగు, బీసీ మహిళలకు ఏడు, బీసీ జనరల్‌కు ఏడు, జనరల్‌ మహిళలకు 12, జనరల్‌కు 10 వార్డులు రిజర్వు చేశారు.

జిల్లాలో 393 పంచాయతీలు, 4,206 వార్డులకు గాను తొలి విడతలో నరసాపురం రెవెన్యూ డివిజన్‌లోని నరసాపురం, మొగల్తూరు, ఆచంట, పెనుమంట్ర, పెనుగొండ, మండలాల్లో 90 పంచాయతీలు, 1,006 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకోసం 15 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. 18న పరిశీలన, 20న అభ్యంతరాల స్వీకరణ, 21న ఉపసంహరణ అనంతరం నవంబరు 26 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 1,062 పోలింగ్‌ స్టేషన్లలో ఎన్నికలు జరుగనున్నాయి. అనంతరం అదేరోజు మధ్యాహ్నం నుంచి ఓట్లు లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

నేటి నుంచి నామినేషన్లు

భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లులో మున్సిపల్‌ ఎన్నికలు

16 వరకు నామినేషన్లకు గడువు

గెలుపు గుర్రాల వేటలో రాజకీయ పక్షాలు

కూటమిలో తేలని పంచాయితీలు

ఏఐ సృష్టించిన చిత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement