మున్సిపల్‌ పోరులో వైఎస్సార్‌సీపీ దూకుడు | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ పోరులో వైఎస్సార్‌సీపీ దూకుడు

Nov 14 2026 1:41 AM | Updated on Nov 14 2026 1:41 AM

శాసనమండలి చైర్మన్‌ నివాసంలో సమాలోచనలు

భీమవరం: జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్‌సీపీ దూకుడు పెంచింది. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి నాయకుల ప్రలోభాలు, పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసినా వైఎస్సార్‌సీపీకి భారీగా ఓట్లు రావడంతో ఈనెల 26 జరిగే మలి విడత మున్సిపల్‌ ఎన్నికలకు అభ్యర్థులను సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా భీమవరం మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్లు, చైర్మపర్సన్‌ అభ్యర్థి ఎంపికకు సంబంధించి పార్టీ నాయకులు శుక్రవారం శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు నివాసం వద్ద సమావేశమయ్యారు. వన్‌టౌన్‌ పరిధిలోని 25 వార్డు కౌన్సిలర్లను ఎంపిక చేసేందుకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఏఎస్‌ రాజు, వేండ్ర వెంకటస్వామి, ఎస్‌ఈసీ సభ్యుడు మేడిది జాన్సన్‌ తదితరులు మోషేన్‌రాజుతో సంప్రదింపులు జరిపారు. ఈ సంద ర్భంగా వెంకటరాయుడు మాట్లాడుతూ మున్సిప ల్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా కష్టించి పనిచేయాలన్నారు. కూ టమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నందున ఎన్నికల్లో హామీలిచ్చి అమలుచేయని అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావడంతోపాటు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కోడే యుగంధర్‌, నాయకులు కామన నాగేశ్వరరావు, గాదిరాజు రామరాజు, ఇంటి సత్యనారాయణ, చిరుగుపాటి సందీప్‌, కరీముల్లా బాషా, గుంటి ప్రభు, పేరిచర్ల సత్యనారాయణరాజు, బండి శక్తేశ్వరసాంబమూర్తి, వాసర్ల ముత్యాలరావు, జంగం మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement