పారా క్రీడాకారులకు అభినందనలు | - | Sakshi
Sakshi News home page

పారా క్రీడాకారులకు అభినందనలు

Aug 11 2026 2:06 AM | Updated on Aug 11 2026 2:06 AM

భీమవరం (ప్రకాశంచౌక్‌): థాయ్‌లాండ్‌లోని శ్రీరాచాలో ఏప్రిల్‌లో నిర్వహించిన ’వరల్డ్‌ మాస్టర్స్‌ స్పోర్ట్స్‌ చాంపియన్‌షిప్‌–2026లో జిల్లాకు చెందిన దివ్యాంగ క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఆ క్రీడాకారులు సోమవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో కలెక్టర్‌ చదలవాడ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ క్రీడాకారులను అభినందించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా నుంచి మరికొంతమంది క్రీడాకారులు తయారవ్వాలని ఆమె ఆకాంక్షించారు. పారా అథ్లెటిక్స్‌లో అత్తిలి గ్రామానికి చెందిన యడ్లపల్లి సూర్యనారాయణ షాట్‌పుట్‌ ఎఫ్‌–42 కేటగిరీలో బంగారు పతకం, జావెలిన్‌ త్రో ఎఫ్‌–42 కేటగిరీలో కాంస్య పతకం సాధించారు. అలాగే పాలకొల్లుకు చెందిన మురపాక నళిని రాజశేఖర్‌ పారా పికిల్‌బాల్‌ పీపీ–54 కేటగిరీలో కాంస్య పతకం, జావెలిన్‌ త్రో ఎఫ్‌–54 కేటగిరీలో వెండి పతకం సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కే.ఆర్‌. కల్పశ్రీ, డీఆర్వో పీ. ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement