అమరావతి చాంపియన్‌షిప్‌ క్రీడా పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అమరావతి చాంపియన్‌షిప్‌ క్రీడా పోటీలు ప్రారంభం

Aug 11 2026 2:06 AM | Updated on Aug 11 2026 2:06 AM

భీమవరం: విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే మంచి శారీరక దారుఢ్యంతో పాటు విద్యలోనూ అగ్రస్థానంలో నిలుస్తారని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. స్థానిక ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం అమరావతి చాంపియన్‌షిప్‌ జిల్లా స్థాయి క్రీడా పోటీలను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్‌ ఎస్పీ డి.విశ్వనాథ్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్‌ పి.రవీంద్రనాథ్‌, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి (డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌) నూతక్కి మోహన్‌దాస్‌ మాట్లాడుతూ క్రీడాకారులు మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడా ప్రతిభను చాటాలన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించి వాలీబాల్‌లో 190 మంది, వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఏడుగురు, చెస్‌లో 41 మంది, బ్యాడ్మింటన్‌లో 56, యోగాలో 63 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ కేవీ మురళీకృష్ణంరాజు అధ్యక్షత వహించగా, కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ సాగి రామకృష్ణ నిషాంత వర్మ, సీహెచ్‌.దిలీప్‌ చక్రవర్తి, పీడీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement