రోడ్డు ప్రమాదంలో భవానీ భక్తుడి మృతి
హనుమాన్‌జంక్షన్ రూరల్: బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో భవానీ భక్తుడు మృతి చెందాడు. ఈ ఘటన బాపులపాడు మండలం ఉమామహేశ్వరపురం వద్ద చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలోని సజ్జాపురానికి చెందిన కుక్కనూరి జయరామ్ (33) భవానీ దీక్ష విరమణ నిమిత్తం స్నేహితుడు అలబాని సాయితేజతో కలిసి సోమవారం పల్సర్ బైక్‌పై విజయవాడ దుర్గ గుడికి బయలుదేరారు. అమ్మవారి దర్శనం ముగించుకుని బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తుండగా ఉమామహేశ్వరపురం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపు తప్పి రహదారి డివైడర్‌ను ఢీకొట్టడంతో వాహనం నడుపుతున్న జయరామ్ తీవ్ర రక్తస్రావానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సాయితేజ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈ నెల 26న జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్ జితేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. జంగారెడ్డిగూడెం సూర్య డిగ్రీ కాలేజీలో నిర్వహించే ఈ జాబ్ మేళాలో 17కి పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, పూర్తి వివరాలకు 96525 03799, 96663 22032 నెంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.


