రొయ్యల చెరువులో విష ప్రయోగం
ఆకివీడు: మండలంలోని కుప్పనపూడిలో ఎకరంన్నర రొయ్యల చెరువులో విష ప్రయోగం చేయడంతో చెరువులోని రొయ్యలన్నీ చనిపోయాయి. చెరువు యజమాని మారుబోయిన రాంబాబు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు పురుగు మందు కలిపినట్లు గుర్తించి ఆకివీడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన సలాది సూర్యనారాయణకు చెందిన చెరువును లీజుకు తీసుకుని సాగు చేస్తున్నట్లు రాంబాబు తెలిపారు. ఎస్సై నాగరాజు చెరువును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.
ఏలూరు టౌన్: ఏలూరు కొత్తపేట ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక కొత్తపేట గాదివారి వీధికి చెందిన గేదెల సాయికుమార్ (33) పూలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంత కాలంగా భార్యతో విభేదాలు రావటంతో ఆమె నుంచి దూరంగా ఉంటున్నాడు. ఒంటరిగా జీవిస్తోన్న సాయికుమార్ ఆదివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
పెదపాడు: ఎన్టీఆర్ జిల్లా నున్నలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌న్ ఆఫ్ ఇండియా(ఎస్‌జీఎఫ్‌ఐ) సైక్లింగ్ ట్రాక్ ఈవెంట్‌లో ఏలూరుకు చెందిన జీ స్నేహిత ద్వితీయస్థానం సాఽధించింది. దీంతో జార్ఖండ్‌లోని రాంచిలో జనవరి 13న జరిగే పోటీలకు ఎంపికై ంది.
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఏఆర్‌సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–19 బాలబాలికల హ్యాండ్‌బాల్ పోటీలు సోమవారం హోరాహోరీగా జరిగాయి. పూల్ సిలో విన్నర్‌గా వెస్ట్ గోదావరి, రన్నర్‌గా విజయనగరం జట్లు నిలిచాయి.
రొయ్యల చెరువులో విష ప్రయోగం


