అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
భీమవరం(ప్రకాశం చౌక్): పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో ఆమె పాల్గొన్ని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని నిర్ణీత గడువులోపుగా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులు సంతృప్తిచెందేలా సమస్యలను పరిష్కరించాలన్నారు. అధికారులు లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు.


