కాళోజీ సెంటర్: ప్రతీఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. మంగళవారం నగరంలోని రంగశాయిపేట, వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా షూ, బ్యాగులను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ప్రభు త్వ జూనియర్ కళాశాలల్లో ఉచిత నోట్ బుక్స్‌తో పాటు బ్యాగ్స్, షూస్ తదితర అన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఏక్ పేడ్ మా కే నామ్ అనే కార్యక్రమం కింద ప్రతిఒక్కరూ మొక్క నాటి జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ సంపత్ కుమార్, సుజా త, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
డీఐఈఓ శ్రీధర్ సుమన్


