ఆరు లేన్లతో... మరింత వేగం! | - | Sakshi
Sakshi News home page

ఆరు లేన్లతో... మరింత వేగం!

Aug 26 2026 1:30 AM | Updated on Aug 26 2026 1:30 AM

ఆరు లేన్లతో... మరింత వేగం!

సాక్షి, వరంగల్‌: హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారి... రెండు నగరాల మధ్య రాకపోకలకు కీలకమైన కారిడార్‌. పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తుండడం.. నగరాల చుట్టూ జనా భా, వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో ఈ మార్గంపై రద్దీ కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు లేన్లుగా ఉన్న రహదారిని భ విష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఆరు లేన్లుగా వి స్తరించాలని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు నిర్ణయించారు. ప్రస్తు తం హైదరాబాద్‌–యాదగిరిగుట్ట సెక్షన్‌లో 35.65 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్లుగా మార్చేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీకి కన్సల్టెన్సీ టెండర్‌ పిలిచింది.

ఇదీ వరంగల్‌కు పరోక్ష ప్రయోజనం..

నాలుగు లేన్ల రహదారిపై వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ ఓవర్‌ టేకింగ్‌, లేన్‌ మార్పులు, జంక్షన్ల వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. ఆరు లేన్లుగా విస్తరిస్తే వాహనాలకు అదనపు లేన్‌ సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా రద్దీని మెరుగ్గా ని ర్వహించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్‌ శివారు ప్రాంతాలనుంచి యాదగిరిగుట్ట, జనగామ, వరంగల్‌ వైపు నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులకు ప్రయోజనం కలగవచ్చు. హైదరాబాద్‌– యాదగిరి భాగం ఆరు లేన్లుగా అభివృద్ధి చెందితే హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు వచ్చే మొత్తం కారిడార్‌ సామర్థ్యం పెంచే దిశలో ఇది ఒక ముఖ్యమైన కీలక అడుగుగా మారనుంది. పారిశ్రామిక ప్రాంతాలకు సరకు రవాణా, వ్యాపార వాహనాల రాకపోకలు, అంతర్‌నగర ప్రయాణా లకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడానికి దోహదపడే అవకాశం ఉంది.

హైదరాబాద్‌–వరంగల్‌ కారిడార్‌కు పెరగనున్న సామర్థ్యం

హైదరాబాద్‌–యాదగిరిగుట్ట వరకు 35.65 కి.మీ. విస్తరణకు డీపీఆర్‌ టెండర్‌

రాబోయే రోజుల్లో యాదగిరిగుట్టనుంచి వరంగల్‌ రహదారి విస్తరణకు చాన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement