‘జలసిరి’ పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

‘జలసిరి’ పనుల పరిశీలన

Aug 26 2026 1:36 AM | Updated on Aug 26 2026 1:36 AM

నోటీసులు జారీ ‘సర్‌’

గీసుకొండ: మండలంలోని పలు గ్రామాల్లో జలసిరి కింద చేపడుతున్న పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గణేశ్‌ మంగళవారం పరిశీలించారు. కొమ్మాల, నందనాయక్‌తండా, విశ్వనాథపురం, గంగదేవిపల్లి గ్రామాల్లోని కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, రూప్‌టాప్‌ హార్వెస్టింగ్‌ నిర్మాణాలను, కొత్తగా ముగ్గు పోసే పనులను పరిశీలించారు. ఎంపీడీఓ కృష్ణవేణి, తహసీల్దారు ఎండీ రియాజుద్దీన్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ సురేశ్‌, ఈజీఎస్‌ ఏపీఓ చంద్రకాంత్‌, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

టీబీఎస్‌ఎఫ్‌ బ్లాగ్‌ ఆవిష్కరణ

కాళోజీ సెంటర్‌: తెలంగాణ బయోలాజికల్‌ సైన్స్‌ ఫోరం (టీబీఎస్‌ఎఫ్‌) జిల్లా శాఖ రూపొందించిన ఆన్‌లైన్‌ బ్లాగ్‌ను మంగళవారం డీఈఓ రంగయ్యనాయుడు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పోర్టల్‌లో జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ఉన్నతమైన డిజిటల్‌ రిసోర్స్‌ సెంటర్‌గా ఉపయోగపడాలని ఆకాంక్షించారు. బ్లాగ్‌ రూపకర్త గుమ్మడి రాజుతో పాటు ఫోరం చొరవను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్‌ అధికారి డాక్టర్‌ కట్ల శ్రీనివాస్‌, జిల్లా సైన్స్‌ అధికారి పి.సురేష్‌ బాబు, ఫోరం జిల్లా అధ్యక్షుడు చిప్ప పరమేశ్వర్‌, ప్రధాన కార్యదర్శి గోనెల రమేశ్‌, కోశాధికారి గుమ్మడి రాజు తదితరులు పాల్గొన్నారు.

న్యూశాయంపేట: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ముసాయిదా జాబితా విడుదల అనంతరం వివరాల్లో వ్యత్యాసాలు (అనామలీస్‌, అన్‌మ్యాపింగ్‌) విభాగాల కింద గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ కానున్నాయి. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తంగా 1,94,399 మంది ఓటర్లకు జిల్లా ఎన్నికల అధికారులు నోటీసులు జనరేట్‌ చేశారు. ఇందులో 1,71,207 మంది ఓటర్లకు నోటీసులు అందించేందుకు ప్రింట్‌ తీసి సిద్ధం చేశారు. నర్సంపేట నియోజకవర్గంలో 51,880 ఓటర్లు, వరంగల్‌ తూర్పులో 75,755, వర్ధన్నపేటలో 66,764 మంది ఓటర్లకు నోటీసులు జనరేట్‌ చేశారు. ఇందులో మంగళవారం వరకు నర్సంపేటలో 207, వరంగల్‌ తూర్పులో 42, వర్ధన్నపేట నియోజకవర్గంలో 14 మంది ఓటర్లకు ఇప్పటికే నోటీసులు అందించారు. కాగా బీఎల్‌ఓల ద్వారా నోటీసులు అందుకున్న వారు గుర్తింపు పొందిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

పంచాయతీ

కార్యదర్శిపై దాడి

ఖానాపురం: పంచాయతీ కార్యదర్శిపై సర్పంచ్‌ దాడి చేసిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకా రం.. మండలంలోని బోటిమీదితండా పంచాయతీ కార్యదర్శిగా ఆవుల రవి విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం విధులకు వెళ్తుండగా సర్పంచ్‌ భానుప్రసాద్‌ అకారణంగా దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. దీంతో సర్పంచ్‌ భానుప్రసాద్‌పై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుతూ ఎస్సై రామ్మోహన్‌, ఎంపీడీఓ అద్వైతలకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మిరపసాగుపై అవగాహన

దుగ్గొండి: మండలంలోని తిమ్మంపేట గ్రామంలో జిల్లా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మంగళవారం మిరప పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ శాస్త్రవేత్త రాజుకుమార్‌ మాట్లాడారు. మిరప సాగులో మెళకువలు, నల్లతామర నివారణ పద్ధతులు, సేంద్రియ ఎరువుల వాడకంపై వివరించారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న పంటల సాగువైపు రైతులు కదలాలని సూచించారు. కేవీకే మల్యాల శాస్త్రవేత్త మిరప పంటలో చీడపీడలు, తెగుళ్లు నివారణ పద్ధతులు, చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులను వివరించారు. అనంతరం 50 మంది రైతులకు అర్క తేజస్వి మిరప విత్తనాలు అందించారు. సర్పంచ్‌ మోడెం శ్రీలత, డివిజన్‌ ఉద్యానశాఖ అధికారి జ్యోతి, పీఏసీ ఎస్‌ చైర్మన్‌ చెన్నూరి కిరణ్‌రెడ్డి, ఏఓ శ్యామ్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement