ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య ఈ విద్యా సంవత్సరంలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు ఆటపాటల ఆధారిత అభ్యాసన ప్రధాన ఉద్దేశం. బోధన పద్ధతులను బలోపేతం చేసేందుకు ప్రతీ పాఠశాల హెచ్‌ఎం లేదా సీనియర్ ఉపాధ్యాయులు ప్రతీ వారం (ముఖ్యంగా శుక్రవారం) ఒక తరగతిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ‘ఫీడ్‌బ్యాక్ డైరీ’ నిర్వహించి, ఉపాధ్యాయుల ప్లస్ పాయింట్లు, మార్చుకోవాల్సిన అంశాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలి. – బి.రంగయ్యనాయుడు, డీఈఓ


