భీమదేవరపల్లి: మండలంలోని ముత్తారం గ్రామంలో అతి ప్రాచీన శైవుల సమాధిశిల బయటపడింది. శైవుల్లో గురువులుగా ఉన్నవాళ్లకు ఈ విధంగా సమాధిశిల నిర్మిస్తారని చరిత్ర చెబుతోంది. గ్రామంలోని అతి ప్రాచీన త్రికుటాలయం సమీపంలో ఒక వ్యవసాయ బావి వద్ద ఈ శిల ఉంది. ఆలయ సమీపంలో ఉన్న ఈ శిల వరదల్లో కొట్టుకుని వచ్చి ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఈ భూమి యజమాని మోకిడి మోహన్‌రావు తమ పూర్వీకులదే ఈ శిల అని వెల్లడించారు. తన ముత్తాత మోకిడి రాజన్న సమాధి అని వెల్లడించారు. ఆయన ఒక గొప్ప శైవభక్తుడు కావడంతో అతడి సమాధిని ఇలా నిర్మించారని చెప్పారు. ఇలా సమాధి సిద్దిపేట జిల్లా భోగేశ్వరాలయం వద్ద కూడా ఉన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.


