టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అశ్వథ్థామరెడ్డి
హన్మకొండ: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథ్థామరెడ్డి అన్నారు. బుధవారం విద్యుత్ బస్సులు నడుపుతున్న హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్–2 డిపోను సందర్శించారు. ఎలక్ట్రిక్ బస్సులను పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వరంగల్–2 డిపో మేనేజర్ రవిచందర్‌ను కలిసి కార్మికులకు ఇబ్బంది లేకుండా డ్యూటీలు వేయాలని సూచించారు. అనంతరం వరంగల్–1 డిపోలో టీఎంయూ వరంగల్–1 డిపో కమిటీని డిపో మేనేజర్ పుప్పాల అర్పితకు పరిచయం చేశారు. అక్కడి నుంచి ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయానికి చేరుకుని ఆర్‌ఎం భవానీప్రసాద్‌తో సమావేశమయ్యారు. వరంగల్–2 డిపో కార్మికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. కార్యక్రమంలో టీఎంయూ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు ఎస్.కె.వై.పాషా, కార్యదర్శి జితేందర్‌రెడ్డి, నాయకులు ఆర్‌వీ.గోపాల్, రాతిపల్లి సాంబయ్య, రంజిత్, యాదగిరి, శివరాత్రి దుర్గయ్య పాల్గొన్నారు.


