పని చేయని లిఫ్టులతో పరేషాన్‌! | - | Sakshi
Sakshi News home page

పని చేయని లిఫ్టులతో పరేషాన్‌!

Jul 16 2026 7:30 AM | Updated on Jul 16 2026 7:30 AM

సూపర్‌ ఆస్పత్రిలో పేషెంట్లకు తప్పనితిప్పలు

కాశిబుగ్గ: హనుమకొండలోని కాకతీయ మెడికల్‌ కాలేజీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో లిఫ్టులు పనిచేయక పేషెంట్లకు తిప్పలు తప్పట్లేదు. బుధవారం హాస్పిటల్‌లోని ఐదో అంతస్తులో ఉన్న డయాలసిస్‌ కేంద్రానికి వెళ్లాల్సిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పని చేస్తున్న ఏకై క లిఫ్ట్‌ కూడా కదలకపోవడంతో పేషెంట్లు మెట్ల మార్గం ద్వారా అతికష్టమ్మీద డయాలసిస్‌ సెంటర్‌కు చేరుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి హాస్పిటల్‌లో ఉన్న ఆరు అంతస్తులకు ఆరు లిఫ్ట్‌లు ఉండగా, గతేడాది నుంచి ఒక్క లిఫ్ట్‌ మాత్రమే పనిచేస్తోంది. ప్రస్తుతం ఆ లిఫ్ట్‌ కూడా ఆగిపోవడంతో రోగులు ఇక్కట్లకు లోనయ్యారు. ఇకనైనా అధికారులు అన్ని లిఫ్టులకు మరమ్మతు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని పేషెంట్లు, అటెండెంట్లు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement