నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం

Sep 4 2026 2:42 AM | Updated on Sep 4 2026 2:42 AM

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ధర్మసాగర్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం, నాణ్యమైన విద్యనందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం ధర్మసాగర్‌ మండలం కాషాగూడెం ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌తో కలిసి ఆయన సీఎం బ్రేక్‌ ఫాస్ట్‌ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్‌ విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించి, చిన్నారుల మధ్య కూర్చొని బ్రేక్‌ ఫాస్ట్‌ చేశారు. అనంతరం రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కాషాగూడెం ప్రాథమిక పాఠశాలను అప్పర్‌ ప్రైమరీ పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు కృషి చేస్తానన్నారు. కాగా, కాషాగూడెం గ్రామాన్ని కాసీం నగర్‌గా మార్చాలని, కొత్త పంచాయతీ భవనం, సీసీ రోడ్ల కోసం రూ.20 లక్షలు కేటాయించాలని కలెక్టర్‌ను స్థానికులు కోరారు. కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ.. హరేకృష్ణ సంస్థ భాగస్వామ్యంతో రోజుకో మెనూతో తాజా అల్పాహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ సయ్యద్‌ సత్తార్‌, డీఈఓ గిరిరాజ్‌ గౌడ్‌, తహసీల్దార్‌ భావ్‌సింగ్‌, ఎంపీడీఓ అనిల్‌ కుమార్‌, ఎంఈఓ శ్రీదేవి, పాఠశాల హెచ్‌ఎం యాస్మిన్‌ జహాన్‌, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement