హన్మకొండ చౌరస్తా: పదేళ్లలో చేయని అభివృద్ధిని రెండున్నరేళ్లలో చేసి చూపించామని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం హనుమకొండలోని డీసీసీ భవన్‌లో సంబురాలు జరుపుకున్నారు. డీసీసీ భవన్ నుంచి అశోకా జంక్షన్ వరకు ప్రదర్శనగా వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు బాణసంచా కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గత పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, శ్రేణులు పాల్గొన్నారు.


