● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
● కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై భారీ ర్యాలీ
పరకాల: జిల్లాల పునర్విభజన సమయంలో విదేశాల్లో దాక్కుని పరకాలకు తీరని అన్యాయం చేసిన ద్రోహి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. వ్యాపారవేత్తగా పనికి వస్తాడే తప్ప.. ప్రజాప్రతినిధిగా పనికిరాడని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా టీపీసీసీ ఆదేశాల మేరకు పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి 1,000 రోజుల విజయపథంతో ముందుకు వెళ్తుంటే.. ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. తక్కువ ధరలకు పేదల భూములు కొని ప్రభుత్వ సొమ్మతో రోడ్డు వేసి ఎక్కువ ధరకు అ మ్ముకున్న చరిత్ర ధర్మారెడ్డిదని అన్నారు. కార్యక్రమ ంలో పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్, వైస్ చైర్మన్ ఏకు దివ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షుడు బొచ్చు శ్రవణ్, చందు, కాంగ్రెస్ కౌన్సిలర్లు, మండల నాయకులు పాల్గొన్నారు.


